Home » టాలీవుడ్ లో 5.3 ఎవ్వరూ లేరు.. నాగబాబు కామెంట్స్ పై వరుణ్ తేజ్ ఏమన్నారంటే..?

టాలీవుడ్ లో 5.3 ఎవ్వరూ లేరు.. నాగబాబు కామెంట్స్ పై వరుణ్ తేజ్ ఏమన్నారంటే..?

by Anji
Ad

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతను నటించిన మూవీ ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 01న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమైంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వరుణ్ తేజ్ కి జోడిగా ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా పని చేస్తుంది. విపత్కర పరిస్థితుల్లో వాళ్లు దేశాన్ని రక్షించడానికి ప్రాణాలను సైతం ఎలా పణంగా పెడతారు వంటి అంశాలని ఈ సినిమాలో హైలైట్ చేయబోతున్నారు.

Advertisement

దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ చాలా అధ్యయనం చేసిన తరువాత ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రిలీజ్ కి ముందు ఈ సినిమా విషయంలో ఓ వివాదం నెలకొంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తండ్రి నాగబాబు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇండియన్ ఆర్మీ యొక్క గొప్పతనాన్ని సంఘటన ఆధారంగా వివరించారు. ఇండియన్ ఆర్మీలో పని చేసే భర్తలను కోల్పోయిన భార్యలకు రూ.6లక్షలు విరాఠం కూడా ప్రకటించారు. నాగబాబు మాట్లాడిన ఓ మాట వివాదానికి తెర తీసింది.  వరుణ్ తేజ్ కెరీర్ ప్రారంభం నుంచి రిస్క్ తో కూడుకున్న పాత్రలు చేస్తున్నాడని.. అందుకు గర్వంగా ఉందని చెప్పాడు.

Advertisement

 

ఇండియన్ ఆర్మీ, పోలీస్ తరహా పాత్రలకు వరుణ్ తేజ్ హైట్ బాడీ లాంగ్వేజ్ ఫర్ ఫెక్ట్ గా ఉంటుందని.. 5.3 అంగుళాలు ఎత్తు ఉండే వ్యక్తి కూడా పోలీస్ పాత్రలు వేస్తే చూడటానికి బాగుండదు అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. నాగబాబు 5.3 అంగుళాల ఎత్తు అంటూ టాలీవుడ్ లో అగ్ర హీరోపై సెటైర్లు వేశారని కొందరూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనిపై వరుణ్ వివరణ ఇస్తూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు ఇండియన్ ఆర్మీ గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మాట్లాడారు. ఇవన్నీ సైడ్ అయపోయాయి. కుట్ర పూరితంగా ఆ ఒక్క మాటనే వైరల్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. అసలు టాలీవుడ్ లో 5.3 హైట్ ఉండే హీరో ఎవ్వరూ లేరు. నేను 6.3 హైట్ ఉంటాను.. నాన్న ఫ్లోలో 5.3 అడుగులు ఉన్నవాళ్లు పోలీస్ పాత్రలకు అంతగా సూట్ కారని అన్నారు. ఇందులో వివాదం ఏముంది అని ప్రశ్నించారు. చూస్తుంటే ఇది కుట్ర పూరితంగానే నెగిటివిటీ పెంచుతున్నట్టు ఉన్నారని తెలిపారు వరుణ్ తేజ్.

Also Read : ఎంజీఆర్ తొక్కేసిన న‌టుడిని ఎన్టీఆర్ పైకి తీసుకొచ్చారు.. ఆ న‌టుడు ఎవ‌రంటే..?

Visitors Are Also Reading