Home » బాలయ్య కంటే చిరు మార్కెట్ ఎక్కువగా ఉండడానికి 2 కారణాలున్నాయి.. ఏంటంటే..?

బాలయ్య కంటే చిరు మార్కెట్ ఎక్కువగా ఉండడానికి 2 కారణాలున్నాయి.. ఏంటంటే..?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో 60 సంవత్సరాలు దాటిన హీరోలలో బాలకృష్ణ, చిరంజీవి ఉన్నారు.. 6 పదులు దాటిన హీరోలు ఇంకా చాలామంది ఉన్నా వీరికున్నంత ఫాలోయింగ్ మిగతా వారికి లేదని చెప్పవచ్చు. ప్రస్తుతమున్న యంగ్ స్టార్ హీరోలకు దీటుగా ఈ ఓల్డ్ స్టార్ హీరోలు ఎప్పుడు బరిలో నిలుస్తూనే ఉన్నారు.. అలాంటి ఈ ఇద్దరు హీరోలు చాలాసార్లు సంక్రాంతి బరిలో పోటీపడ్డారు. అయితే 2022లో కూడా సంక్రాంతి బరిలో ఉన్న బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్యతో వచ్చారు.. మరి ఇద్దరిలో వాల్తేరు వీరయ్య కాస్త మెరుగ్గా ఉండటంతో సూపర్ హిట్ గా దూసుకుపోయింది.. బాలకృష్ణ సినిమా కాస్త డల్ అయింది అని చెప్పవచ్చు.

Advertisement

Also Read:మనస్ఫూర్తిగా ప్రేమించే అబ్బాయిల్లో ఈ లక్షణాలు ఉంటాయట..!!

మరి చిరంజీవికి ఈ విధంగా మార్కెట్ వ్యాల్యూ ఎక్కువగా ఉండటానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇంతకీ అవి ఏంటయ్యా అంటే.. ముఖ్యంగా చిరంజీవి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథాంశంపై దృష్టి పెడతారు.. కానీ బాలకృష్ణ మాత్రం సినిమాలపై మాత్రమే దృష్టి పెడుతూ ఉంటారు.అది కాస్త మైనస్ అని చెప్పవచ్చు. బీసీ సెంటర్లలో బాలయ్య సినిమాలు ఆడిన స్థాయిలో ఏ సెంటర్లలో కూడా ఆడడం లేదు. అంతేకాకుండా కమర్షియల్ గా విజయవంతమైన సినిమాలు తక్కువగా ఉండడం , వరుసగా విజయాలను సొంతం చేసుకునే విషయంలో బాలయ్య ఫెయిల్ అవ్వడం తన సినీ కెరియర్ పై ప్రభావం చూపుతోంది.

Advertisement

అంతేకాకుండా సరైన టైంలో రిలీజ్ చేయకపోవడం, రిలీజ్ డేట్ ల విషయంలో పొరపాట్లు చేయడం బాలయ్య కు మైనస్ గా మారుతున్నాయి. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను బాలయ్య సరిదిద్దుకుంటే రికార్డులు క్రియేట్ చేస్తారని కొంతమంది సినీ ప్రముఖులు అంటున్నారు. ఇక చిరంజీవి మాత్రం సినిమాలో ఏ సీన్ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా, ప్రతి విజువల్ అద్భుతంగా రావాలని పట్టుదలతో ఉంటారట. ప్రతి జనరేషన్ కు కథాకథాంశం నచ్చాలనే కాన్సెప్ట్ తో కథలను ఎంచుకోవడం వంటివి చేస్తారట. ఈ విధంగా చిరంజీవి సినిమాలు చాలా వరకు సూపర్ హిట్ అవుతున్నాయి.. ఏది ఏమైనా ఈ సంక్రాంతి బరి లో రెండు సినిమాలు బాగానే ఉన్నా వాల్తేరు వీరయ్య మాత్రం ప్రేక్షకులకు కాస్త ఎక్కువగా నచ్చింది.

\Also Read:ఆ హీరో మీద ఉన్న ఇష్టంతోనే ఆ పని చేశాను.. రష్మిక షాకింగ్ కామెంట్స్..!!

Visitors Are Also Reading