ఈ మధ్య కాలంలో అన్ని వింత ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లిల విషయంలో చిత్ర విచిత్రమైన వార్తలు వింటుంటాం. ఇద్దరూ అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారని.. ఇద్దరూ గే లు పెళ్లి చేసుకున్నారనే విషయాలు ఇటీవల వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడం జిల్లాలోని ఇల్లెందులో ఇలాంటి వెరైటీ వివాహం జరిగింది.
Advertisement
ఇల్లెందులో ఓ యువకుడు హిజ్రాను మార్చి 11, 2022న వివాహం చేసుకున్నాడు. భూపాలపల్లికి చెందిన రేపేష్, ఆళ్లపల్లిలోని ఆనంతోగు ప్రాంతానికి చెందిన అఖిలకు మూడేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారి మధ్య ప్రేమకు దారి తీసింది. దీంతో వారిద్దరూ కలిసి ఉండాలని భావించారు. అందులో భాగంగానే ఇల్లందు పట్టణంలో ఓ ఇంట్లో మూడు నెలల నుంచి కలిసి ఉంటున్నారు. సహజీవనం చేస్తూ ఉన్నారు. వారిద్దరి మధ్య ప్రేమ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు చెప్పారు. ఎట్టకేలకు పెద్దలను పెళ్లికి ఒప్పించారు. దీంతో పెద్దల సమక్షంలో ఘనంగా వారిద్దరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Advertisement
బెంగళూరులో కూడా ఇంతకు ముందు ఇలాంటి వివాహం జరిగింది. మనోజ్ అనే యువకుడు హిజ్రాను పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల దామినేడులో అయితే ఇద్దరూ హిజ్రాలు పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్లో ఇద్దరు గేలు పెళ్లి చేసుకున్నారు. ఇరువురు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం.. వీరి పెళ్లి ఓ రికార్డును సృష్టించింది. తొలి గే వివాహంగా రికార్డు నమోదు చేసుకుంది. వికారాబాద్ హైవేలోని గ్రీన్ఫీల్డ్ లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. వీరిరువురిలో సుప్రియో సాప్ట్వేర్ కంపెనీ డెవలపర్, అభయ్ లకు ఎనిమిదేళ్ల క్రితమే పరిచయం. వీరి పరిచయం ప్రేమగా మారి ఆ ప్రేమ పెళ్లి దాకా తీసుకెళ్లింది.