మిస్ వరల్డ్-2024 కిరీటం చెక్ రిపబ్లిక్కు దక్కింది. ఆ దేశం నుంచి ప్రాతినిథ్యం వహించిన క్రిస్టినా పిస్కోవా మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్నారు. ముంబయి వేదికగా అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. టాప్-4లో క్రిస్టినా పిస్కోవా (చెక్ రిపబ్లిక్), యాస్మిన్ అజైటౌన్ (లెబనాన్), అచే అబ్రహాంస్ (ట్రినిడాడ్ అండ్ టుబాగో), లీసాగో చోంబో (బోట్స్వానా)లు నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోటీలో మిస్ వరల్డ్ కిరీటం క్రిస్టినాకు దక్కింది. రన్నరప్ గా లెబనాన్ కి చెందిన అజైటౌన్ నిలిచారు.
Advertisement
Advertisement
ఇక భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన మిస్ ఇండియా సిని శెట్టి ఈ అందాల పోటీల్లో మొదటి నాలుగు స్థానాల్లో కూడా నిలువలేకపోయింది. ఈ క్రమంలో 8వ స్థానం దక్కించుకుంది. పోటీ సమయంలో, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు సాధికారత కల్పించడంలో సోషల్ మీడియా పాత్ర గురించి సినీని ప్రశ్నించారు. ఆ క్రమంలో ఆమె స్పందన న్యాయనిర్ణేతలను ఆకట్టుకోవడంలో విఫలమై ఉండవచ్చని తెలుస్తోంది. కర్నాటకకు చెందిన సిని శెట్టి 2022లో ఫెమినీ మిస్ ఇండియా 2022 కిరీటాన్ని గెలుచుకుంది. గతంలో భారత్ ఆరుసార్లు ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకుంది. రీటా ఫరియా (1966), ఐశ్వర్య రాయ్ బచ్చన్ (1994), డయానా హేడెన్ (1997), యుక్తా ముఖీ (1999), ప్రియాంక చోప్రా (2000), మానుషి చిల్లర్ (2017) ఇప్పటివరకు ఇండియా తరపున టైటిల్స్ గెలిచారు.
Also Read : నీతా అంబానీపై ప్రియాంక ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ ఒక్కటి చాలంటూ..!