అబార్షన్ హక్కులపై అమెరికాలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ముసాయిదా లీకు అవ్వడంతో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. వాషింగ్టన్ డీసీలోని సర్వోన్నత న్యాయస్థానం భవనాన్ని ఆందోళన కారుడు చుట్టుముట్టారు. తమ హక్కులు కాలరాయవద్దంటూ నినాదాలు చేసారు.
Advertisement
అబార్షన్ హక్కులపై 1973లో రో వర్సెస్ వేడ్ కేసులో ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును జస్టిస్ శామ్యూల్ ఆలిటో రద్దు చేస్తున్నట్టు లీకైన ముసాయిదాలో ఉంది. రో వర్సెస్ వేడ్ కేసులో ఇచ్చిన వివరణ బలహీనంగా ఉన్నదని.. దాని పరిణామాలు ప్రమాదకరంగా ఉన్నట్టు జస్టిస్ అలిటో అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు ఇస్తున్న తీర్పు సరిగ్గా లేదని లీకైన డాక్యుమెంట్‌పై విమర్శలు వస్తున్నాయి.
Advertisement
ముఖ్యంగా అబార్షన్ హక్కులపై తీర్పు లీకు అయినా సమాచారంపై సుప్రీంకోర్టు కానీ వైట్ హౌజ్ కానీ స్పందించలేదని సమాచారం. ఇందుకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ఎన్నికైన ప్రతినిధులకు ఇవ్వాలనే అభిప్రాయాన్ని ఆ ముసాయిదాలో వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సోమవారం కొందరూ సుప్రీంకోర్టు ముందు నిరసన చేపట్టారు. దీంతో ఆందోళనలు తారా స్థాయికి చేరుకున్నాయి. జులైలో అబార్షన్ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది.
Also Read :
టిఫిన్ బండి వద్ద టిఫిన్ చేస్తున్న ఈ కోటీశ్వరుడిని మీరు గుర్తు పట్టారా..?
Viral video : ఎర్రని ఎండలో రోడ్డు పై కొత్త జంట రేసింగ్..!