Home » కృష్ణ-విజయ నిర్మల పెళ్లిని ఆ టాప్ కమెడీయన్ ముందే ఊహించారు.. అతను ఎవరో తెలుసా?

కృష్ణ-విజయ నిర్మల పెళ్లిని ఆ టాప్ కమెడీయన్ ముందే ఊహించారు.. అతను ఎవరో తెలుసా?

by Anji
Published: Last Updated on
Ad

సూపర్ స్టార్ కృష్ణ-విజయనిర్మల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అప్పటికే వేర్వేరు వ్యక్తులతో వీరికి పెళ్లి జరిగి పిల్లలు ఉన్న  వీరిద్దరూ రెండో పెళ్లి చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు తెలువారందరినీ షాక్ కి గురి చేశారు. పెళ్లి తరువాత వీరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరి పెళ్లిని ముందుగా ఊహించిన వ్యక్తి ఒకరు ఉన్నారు. అప్పటి టాప్ కమెడీయన్ రాజబాబు. కృష్ణతో మీ పెళ్లి జరుగుతుందని స్వయంగా విజయనిర్మలతో ఆయన చెప్పారు. ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

krishna-and-vijayanirmla

Advertisement

 

కృష్ణ-విజయనిర్మల కలిసి నటించిన మొదటి చిత్రం సాక్షి. ఆ మూవీకి బాపు దర్శకుడు. ఆ సినిమా కార్యాలయంలో ఫస్ట్ టైమ్ తాను కృష్ణ గారిని చూశానని చెప్పారు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  “బాపు గారే కృష్ణ గారికి నన్ను పరిచయం చేశారు. ఈమె విజయనిర్మల తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. తెలుగు అమ్మాయే. మన సినిమాలో హీరోయిన్ గా బుక్ చేసుకున్నాం” అని చెప్పారు.  “అలా మాకు పరిచయం జరిగిందని వెల్లడించారు విజయనిర్మల. సాక్షి మూవీ క్లైమాక్స్ లో కృష్ణ‌తో విజ‌య‌నిర్మ‌ల తాళి క‌ట్టించుకొనే సీన్ ఉంది.

Advertisement

 

అందులో కృష్ణ మీసాలు ఉంచుకొనే కృష్ణుడి వేషం వేస్తారు. ఆ సీన్ చేశాక రాజ‌బాబు, ‘ఈ సినిమాలో నీకుండేది మీసాల కృష్ణుడు. ఈయ‌నేమో కృష్ణ‌. కాబ‌ట్టి మీ ఇద్ద‌రూ చాలా తొంద‌ర‌లో పెళ్లి చేసుకుంటారు.’ అనేశారు. ఆయ‌న అన్న‌ట్లుగానే ఆ త‌ర్వాత రెండు నెల‌ల‌కే మేం తిరుప‌తి వెళ్లిపోయి, దేవుడి స‌న్నిధిలో అక్క‌డ పెళ్లి చేసుకున్నాం. అని ఆమె చెప్పారు. పెళ్ల‌ి జరిగిన తరువాత  ‘అమ్మ‌కోసం’ సినిమాలో  మేము జంట‌గా న‌టించాం. కృష్ణ‌గారి మ‌ద‌ర్ అంజ‌లీదేవి, నాగ‌య్య‌గారు సెట్‌లో ఉన్నారు. ఆయ‌న న‌న్నుచూసి, చాలా కామ్‌గా ఉంటారు నువ్వు, ఆ అబ్బాయి.. ఇలా చేశారేంటి? మేము దిగ్భ్రాంతి చెందాం” అని చెప్పుకొచ్చారు విజ‌య‌నిర్మ‌ల‌.

Also Read :   వివి వినాయక్ ని మొదటి సారి చూసినప్పుడు ఎన్టీఆర్ ఏమనుకున్నారో తెలుసా ? కాని చివరికి ఏమయ్యిందంటే

Visitors Are Also Reading