Home » వెయ్యి కోట్ల రుణం తీసుకోనున్న తెలంగాణ ప్ర‌భుత్వం

వెయ్యి కోట్ల రుణం తీసుకోనున్న తెలంగాణ ప్ర‌భుత్వం

by Anji
Published: Last Updated on

బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రొక వెయ్యి కోట్ల‌ను స‌మీక‌రించుకోనుంది. ఈ మేకు ఆర్థిక శాఖ నోటిఫికేష‌న్ జారీ చేసింది. రిజ‌ర్వ్ బ్యాంకు ద్వారా ఈనెల 29న బాండ్ల‌ను వేలం వేయ‌నున్నారు. రూ.1,029 కోట్ల విలువైన బాండ్ల‌ను 14 ఏళ్ల కాల‌ప‌రిమితితో జారీ చేసింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో ఇదే చివ‌రి రుణం కానుంది.

2021-22 రుణాల ద్వారా రూ.47,500 కోట్లు స‌మ‌కూర్చుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింది. కాగ్‌కు ఇచ్చిన వివ‌రాల ప్ర‌కారం.. జ‌న‌వ‌రి నెలాఖ‌రు వ‌ర‌కు 44,365కోట్ల రూపాయ‌ల‌ను రుణంగా తీసుకోండి. ఫిబ్ర‌వ‌రి నెల‌తో పాటు మార్చిలో ఇంకొంత మొత్తాన్ని అప్పుగా తీసుకోండి. తాజాగా ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రిలో మ‌రొక 1029 కోట్ల‌ను స‌మీక‌రించుకోనుంది.

Visitors Are Also Reading