వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయానికి ‘వ్యూహం’ అనే పొలిటికల్ సినిమాతో రాబోతున్నాడు. జగన్ కి సంబంధించిన కథతో వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు తెస్తున్నాడు. వ్యూహం సినిమాని 2023 నవంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు, శపథం సినిమాని 2024 జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు రామ్ గోపాల్ వర్మ.
Advertisement
వైఎస్ జగన్ కి సంబంధించిన ఈ కథలో రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్ పై జరిగిన కుట్రలు, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత జగన్ సీఎం ఎలా అయ్యారు..? సీఎం అయ్యాక ఏం చేశారు అనే అంశాలతో ఈ రెండు సినిమాలు ఉండనున్నాయి. ఇప్పటికే వ్యూహం సినిమా నుంచి టీజర్ విడుదల చేసి ఆసక్తి నెలకొల్పారు. ఈ సినిమా వెనుక ఎలాంటి వ్యూహం లేదు. ఈ మూవీలో నిజం మాత్రమే ఉంది. వ్యూహం రెండు భాగాలుగా వస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలతో ఈ రెండు సినిమాలు ఉంటాయి. నేను చాలా సౌమ్యుడిని. నేను ఎప్పుడు చంద్రబాబుని కలవలేదు. నాకు జగన్ గారు అంటే ఒక అభిప్రాయం ఉంది. అలాగే చంద్రబాబు గారు అంటే కూడా ఒక అభిప్రాయం ఉంది. కానీ నిజమనేది మాత్రమే ఈ సినిమాలో ప్రజలు చూస్తారు. జగన్ గారి మీద నాకు ఉన్న అభిప్రాయం వ్యూహం సినిమాలో కనపడుతుంది.
Advertisement
తాజాగా వ్యూహం సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో జగన్, భారతి, జగన్ కుటుంబ పాత్రలతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సోనియా గాంధీ.. ఇలా అనేకమంది పాత్రలని చూపించాడు ఆర్జీవీ. జగన్ గా నటుడు అజ్మల్ జీవించాడు అని ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తుంది. ఇక చివరిలో చంద్రబాబు క్యారెక్టర్ తో పవన్ కళ్యాణ్ పై, జగన్ పై చెప్పిన డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వ్యూహం ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది. మరి ఈ సినిమా రాజకీయంగా ఏపీలో ఎన్ని ప్రకంపనలు తెస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలకు వైసీపీ నేత దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.