Home » ఆ కంపెనీల‌ పేర్ల వెనుక ఉన్న క‌థ -2 గురించి మీకు తెలుసా..?

ఆ కంపెనీల‌ పేర్ల వెనుక ఉన్న క‌థ -2 గురించి మీకు తెలుసా..?

by Anji
Ad

డెన్మార్క్‌కు చెందిన ఇద్ద‌రూ ఇంజినీర్లు హెన్నింగ్ హాల్క్ లార్సెన్‌, సోరేన్ క్రిస్టియ‌న్ ట‌ర్బోలు దేశానికి స్వాతంత్య్రం రాక ముందే భార‌త‌దేశానికి వ‌చ్చి దేశంలో ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌ర‌మైన ఇంజ‌నీరింగ్ సేవ‌లందించడానికి 1938లో ముంబై వ‌చ్చి త‌మ ఇంటి పేర్లు అయిన లార్సెన్‌, ట‌ర్బోల‌ను క‌లిపి లార్సెన్ అండ్ ట‌ర్భో సంస్థ‌గా ఏర్పాటు చేసారు. దీనినే మ‌నం ప్ర‌స్త‌తం ఎల్ అండ్ టీగా పిలుస్తున్నాం. ప్ర‌స్తుతం ఈ సంస్థ కింద ప‌లు వ్యాపారాలున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇది విస్త‌రించింది.

ప్ర‌పంచ కుబేరుల‌లో ఒక‌రు అయిన బిల్ గేట్స్ ప్రారంభించిన కంపెనీ 1970-80ల‌లో బాగా ప్రాచుర్యం పొందిన మైక్రో కంప్యూట‌ర్ల‌కు సాప్ట్‌వేర్‌ను త‌యారు చేసింది. ఆ త‌రువాత కంపెనీకి ఒక పేరు అవ‌స‌రం ఏర్ప‌డింది. అప్పుడు మైక్రో కంప్యూట‌ర్స్ లో మైక్రోని, సాప్ట్‌వేర్‌లో సాప్ట్‌ని తీసుకుని మైక్రోసాప్ట్‌గా పేరు పెట్టారు. సాప్ట్‌వేర్ భ‌విష్య‌త్ గురించి అవ‌గాహ‌న ఉండి పెట్టారో లేదో గాని అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు సాప్ట్‌వేర్ రంగంలో రారాజుగా ఎదిగింది.

Advertisement

Advertisement

కంప్యూట‌ర్ హార్డ్‌వేర్‌, సాప్ట్‌వేర్ సేవ‌ల‌ను అందించే స‌న్ మైక్రో సిస్ట‌మ్స్‌లో స‌న్ అనే ప‌దం స్టాన్ ఫోర్డ్ యూనివ‌ర్సిటీ నెట్‌వ‌ర్క్ కి సంక్షిప్త రూపం. ఈ సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు ఆండీ, వినోద్ ఖోస్లా, స్కాట్ మెక్ నీలేలు క‌లుసుకున్న‌ది కూడా స్టాన్ ఫోర్డ్ యూనివ‌ర్సిటీ లోనే. ముఖ్యంగా జావా లాంగ్వేజ్ ని అభివృద్ధి చేసింది వీరే.

ఇంటెల్ కంపెనీ స‌హ వ్య‌వ‌స్థాప‌కులు బాబ్‌నాయ్స్, గోర్డాన్ మూరె త‌మ కొత్త కంప్యూట‌ర్స్ సంస్థ‌కు ప్ర‌ముఖ కంపెనీ హెచ్‌పీ మాదిరిగా ఎం అండ్ ఎన్ పేరు పెడ‌దామ‌నుకున్నారు. కానీ అప్ప‌టికే ఓ ప్ర‌ముఖ హోట‌ళ్ల కంపెనీ ఆ పేరును న‌మోదు చేసుకోవ‌డంతో వారు మ‌రొక పేరు వెత్తుకోవాల్సి వ‌చ్చింది. అప్పుడు ఇంటిగ్రేటేడ్ ఎల‌క్ట్రానిక్స్ కు సంక్షిప్త రూపంగా ఇంటెల్ పెట్టారు. ఇలా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన ప‌లు కంపెనీల పేర్ల వెనుక చ‌రిత్ర ఎంతో దాగి ఉంది.

Also Read :  రాధేశ్యామ్‌లో ప్ర‌భాస్ పోషించిన పాత్ర రియ‌ల్ లైఫ్‌లో ఎవ‌రిదో తెలుసా..?

Visitors Are Also Reading