Home » దుర్భర జీవితం గడుపుతున్న స్టార్ హీరో భార్య.. కూరగాయలు అమ్ముకుంటూ..!!

దుర్భర జీవితం గడుపుతున్న స్టార్ హీరో భార్య.. కూరగాయలు అమ్ముకుంటూ..!!

by Sravanthi
Ad

అప్పుడప్పుడు అనుకోని సంఘటన వల్ల కొన్ని జీవితాలు చాలా దారుణంగా మారిపోతాయి.. కొంతమంది ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపి కొన్నికొన్ని సందర్భాల్లో అన్ని పోగొట్టుకొని రోడ్డున పడి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు కూడా మన సమాజంలో అనేకం ఉన్నారు. అలాంటి ఓ స్టార్ హీరో భార్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం రోడ్లపై వయసు మీద పడ్డ ఒక పెద్దావిడ కూరగాయల అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. పొట్ట కూటి కోసం కోటి విద్యలు అన్న విధంగా వృద్ధాప్యం వేధిస్తున్న ఆమె రోజు పండ్లు, కూరగాయలు అమ్ముకుంటూ బతుకీడుస్తుంది.

 

Advertisement

ALSO READ;అలనాటి హీరోయిన్ చంద్రకళ కూతురు తెలుగు ఇండస్ట్రీలో ఒక స్టార్ గా ఎదిగింది.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

Advertisement

ఇందులో వెరైటీ ఏముంది.. ఆమె కష్టపడి జీవిస్తోంది అని మీరు అనుకుంటున్నారు కదూ.. అవును కష్టం చేస్తుంది.. కానీ ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు తెలుగు తెరపై స్టార్ హీరోగా అందగాళ్ళకే అందగాడిగా పేరు సంపాదించుకున్న హీరో రామకృష్ణ భార్య అంటే ఎవరు నమ్మరు. ఇప్పటి వారికి అంతగా పరిచయం లేదు కానీ 1960-80 లలో రామకృష్ణ మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. దత్తపుత్రుడు, నోము, మాయల మనిషి వంటి సినిమాలతో అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నాడు.

అప్పట్లో కృష్ణ శోభన్ బాబు వంటి హీరోలకు పోటీగా అనేక అవకాశాలు దక్కించుకున్నాడు. తెలుగు తమిళం మలయాళ భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించారు. ఈయన మేనకోడలను వివాహం చేసుకున్నాడు. వీరు చెన్నై లో నివాసం ఉండేవారు. పెళ్లైన కొన్నాళ్లకు వీళ్లిద్దరి మధ్య గొడవలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మరో హీరోయిన్ ను రామకృష్ణ పెళ్లి చేసుకున్నారు. కానీ రామకృష్ణ మొదటి భార్య పరిస్థితి మాత్రం చాలా దారుణంగా తయారయింది. పట్టించుకునే నాధుడే లేక పూట గడవడమే కష్టంగా మారింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆమె రోడ్డుపై కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది.

ALSO READ;ఇంత అందమైన అమ్మాయి హీరో తరుణ్ చెల్లెలా.. చూస్తే షాకవుతారు..!!

Visitors Are Also Reading