Home » అలనాటి హీరోయిన్ చంద్రకళ కూతురు తెలుగు ఇండస్ట్రీలో ఒక స్టార్ గా ఎదిగింది.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

అలనాటి హీరోయిన్ చంద్రకళ కూతురు తెలుగు ఇండస్ట్రీలో ఒక స్టార్ గా ఎదిగింది.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో అలనాడు తన నటనతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అప్పటి హీరోలైన ఎన్టీఆర్,ఏఎన్నార్, కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి స్టార్ హీరోలతో నటించి మంచి పేరు సంపాదించుకుంది హీరోయిన్ చంద్రకళ. ఈమె హీరోయిన్ గా కాక సైడ్ క్యారెక్టర్లు కూడా చేసి మెప్పించింది. ముఖ్యంగా చెల్లెలి పాత్రలో చంద్రకళ పెట్టింది పేరు. చంద్రకళ తెలుగులో విశాల హృదయాలు అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్,శోభన్ బాబు చెల్లెలుగా ఆడపడుచు సినిమాలో నటించింది. చంద్రకళ కర్ణాటక రాష్ట్రానికి చెందిన హీరోయిన్.

Advertisement

ALSO READ;ప‌వ‌న్, మ‌హేశ్ రేంజ్ లో యూత్ ఫాలోయింగ్ ఉన్న సుమంత్ స్టార్ అవ్వలేక‌పోవ‌డానికి ఆ ఒక్క త‌ప్పే కార‌ణ‌మా..?

ఆమె మాతృ భాష వేరైనా తెలుగు మరియు కన్నడ,తమిళ భాషల్లో స్పష్టంగా మాట్లాడేది. అయితే చాలా మంది సీనియర్ నటులు ఆమెను నీ పేరుకు సార్ధకత చేసుకున్నావు అనేవారు. ఎలా అంటే ఆమె పేరులోనే కల అనే పదం ఉంది. కళ అంటే ఆర్ట్ అని అర్థం. అలా నటనతోనే కాకుండా భరతనాట్యం,కూచిపూడి నాట్యం లో మంచి పట్టున్న కథానాయిక. ఇక ఈమె నటించిన చిత్రాలు దసరా బుల్లోడు, రామ రాజ్యం, పుట్టినిల్లు, దొరబాబు, మెట్టినిల్లు, సంపూర్ణ రామాయణం వంటి మరెన్నో చిత్రాల్లో నటించి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. తన కెరియర్ సక్సెస్ఫుల్గా ఉన్న రోజుల్లోనే చంద్రకళ వివాహం చేసుకుంది. 1999 జూన్ 21వ తేదీన క్యాన్సర్ తో చెన్నైలో మరణించింది.

Advertisement

అప్పటికీ ఆమె వయసు 48 ఏళ్లు మాత్రమే. అయితే సినీ వారసత్వంగా వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు కదా. మరి చంద్రకళ వారసులు ఎవరూ లేరా అని మీకు అనుమానం రావచ్చు. చంద్రకళ కు ఒక కూతురు ఉంది. ఆమె పేరే రేష్మ, ఈమె టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయిపోయింది. ఎంబీఏలో మాస్ కమ్యూనికేషన్ పూర్తిచేసి సొంతంగా ఒక యాడ్ ఫిలిం మేకింగ్ సంస్థను స్థాపించి, ఎన్నో చిత్రాలకు యాడ్స్ ను మరియు సినిమా ప్రమోషన్స్ కావలసిన టీజర్స్ ని, పోస్టర్స్ ని డిజైన్ చేస్తూ పబ్లిసిటీ కి కావలసిన అన్ని హంగులు తయారుచేసి అందిస్తూ సినిమా విజయవంతం అవడానికి తెరవెనుక ఉండి కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈమె. ఎటో వెళ్లిపోయింది మనసు,రోబో, ఏం మాయ చేశావే ఇలా ఎన్నో చిత్రాలకు యాడ్స్ మేకింగ్ చేసింది రేష్మ.. ప్రొడ్యూసర్ గా కూడా చాలా సినిమాలు నిర్మించింది.

ALSO READ;ఇంత అందమైన అమ్మాయి హీరో తరుణ్ చెల్లెలా.. చూస్తే షాకవుతారు..!!

Visitors Are Also Reading