Home » దేశంలో అత్యధిక ధనవంతుడిగా స్టార్ కమెడియన్.. అన్ని కోట్లా..?

దేశంలో అత్యధిక ధనవంతుడిగా స్టార్ కమెడియన్.. అన్ని కోట్లా..?

by Anji
Published: Last Updated on

గడచిన కొన్నేళ్ల క్రితం హీరో హీరోయిన్లు స్టార్స్ కాకపోయినా సినిమా చూడగలిగే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఆ సమయంలో ఒక నటుడు మాత్రమే సినిమాని ముందుకు తీసుకువెళ్లే సత్తా కలిగిన నటుడుగా పేరుపొందారు. ఆ నటుడు ఎవరో కాదు కమెడియన్ బ్రహ్మానందం.

బ్రహ్మానందం తన కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. చాలా మంది సెలబ్రిటీలు కూడా మూడ్ ఆఫ్ లో ఉంటే కచ్చితంగా బ్రహ్మానందం ఫన్నీ ఫొటోస్, వీడియోస్ చూసి ఆ బాధ నుంచి బయటికి వస్తూ ఉంటామని ఎన్నో సందర్భాలలో చెప్పారు. ఒక్కసారి ఏదైనా బ్రహ్మానందం నటించిన సినిమాలను కానీ మీమ్స్ గాని చూస్తే ఖచ్చితంగా నవ్వకుండా ఉండలేరు. ఎలాంటి బాధలో ఉన్నా సరే ఆ బాధలన్నీ కూడా మర్చిపోతారని చెప్పవచ్చు.


ఈమధ్య ఫేస్ బుక్ ఇన్ స్టాగ్రామ్ వంటి వాటిలో ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక పోస్ట్ లో బ్రహ్మానందం కనిపిస్తూనే ఉంటారు. బ్రహ్మానందాన్ని ఇష్టపడని వారంటూ ఎవరు కూడా ఉండరు. ఇక తన 36 ఏళ్ల సినీ కెరీర్ లో సుమారుగా 1000 కి పైగా సినిమాలలో నటించిన రారాజుగా కూడా పేరు సంపాదించారు. ఈ మధ్యకాలంలో చాలా తక్కువ సినిమాలలో నటిస్తున్న బ్రహ్మానందం అభిమానులు మాత్రం తనని ముందులాగా సినిమాలలో నటించమని కోరుతూ ఉన్నారు. స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించి మరింత ప్రేక్షక ఆదరణ పొందారు బ్రహ్మానందం. ఈయన నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం సక్సెస్ అయిన సినిమాలు ఉన్నాయి. తెలుగు సినిమాలకు బ్రహ్మానందం గారి సూపర్ స్టార్, మెగాస్టార్ అని కూడా చెప్పవచ్చు. ఎలాంటి పాత్రలోనైనా సరే మైమరిపిస్తూ ఉంటారు బ్రహ్మానందం.


ఇలాంటి బ్రహ్మానందం ఆస్తి విలువ తెలుసుకోవాలని అభిమానులు తెగ వెతికేస్తూ ఉన్నారు. అయితే బ్రహ్మానందం ఆస్తి విలువ సుమారు రూ. 650 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా ధనిక హాస్య నటుడుగా పేరుపొందారు.ఇండియాలోని అత్యంత సంపన్న హాస్యనటులుగా పేరుపొందిన వారిలో కపిల్ శర్మ, జానీ లివర్, భారతి సింగ్ వంటి వారిని కూడా పక్కకు నెట్టేసి, బ్రహ్మానందమే మొదటి స్థాయిలో నిలుచున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మానందం నెల జీతం కూడా దాదాపుగా రూ.2 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఒక్కో సినిమాకి రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల రూపాయల వరకు తీసుకుంటారట. పలు రకాల వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా కొన్ని కోట్ల రూపాయలు ఏడాదికి సంపాదిస్తున్నారు. అత్యధికంగా సినిమాలలో నటించి గిన్నిస్ రికార్డును కూడా అందుకోవడం జరిగింది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading