Home » RRR : ప్ర‌చారం కోసం రాజ‌మౌళి ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రెవ‌రినీ వాడుకున్నాడు..?

RRR : ప్ర‌చారం కోసం రాజ‌మౌళి ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రెవ‌రినీ వాడుకున్నాడు..?

by Anji
Ad

ప్ర‌స్తుతం తెలంగా; ఆంధ్ర‌ప్రదేశ్ స‌హా దేశ‌వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ఫీవ‌ర్‌తో ఊగిపోతోంది. విడుద‌ల‌కు ముందు కేవ‌లం రెండు రోజులే స‌మ‌యం ఉంది. పైగా పాన్ ఇండియా మూవీ కావ‌డంతో రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌లు దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారం చేప‌డుతున్నారు. ఇటీవ‌ల దుబాయ్‌, క‌ర్ణాట‌క చిక్‌బ‌ళ్లాపూర్‌, గుజ‌రాత్ వ‌డోద‌ర‌, ఢిల్లీ, ముంబ‌యి, జైపూర్‌, కోల్‌క‌తా త‌దిత‌ర ప్రాంతాల్లో దేశ‌వ్యాప్తంగా ముమ్మ‌రంగా ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు.

Also Read :  మ‌గ‌ధీర విడుద‌లకు ముందు రోజు రాత్రి మెగాస్టార్ ఇంట్లో ఏమి జ‌రిగిందో తెలుసా..?

Advertisement

ఇటీవ‌ల హిందీ సూప‌ర్ స్టార్ అమీర్ ఖాన్ చీఫ్ గెస్ట్‌గా వ‌చ్చి చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఇక క‌ర్ణాట‌క‌లో అయితే ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చీఫ్ గెస్ట్‌గా విచ్చేశారు. ప్ర‌చారంలో రామ్‌చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, అలియా భ‌ట్‌లు సైతం స్టెప్పులు వేస్తున్నారు. మ‌రొక వైపు ఆర్ఆర్ఆర్ మూవీని 3D టెక్నాల‌జీలో విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ప్రివ్యూను రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ స‌హా ఆర్ఆర్ఆర్ టీమ్ మెంబ‌ర్స్ మార్చి 24న రాత్రి హైద‌రాబాద్ సుద‌ర్శ‌న్ 35 ఎం.ఎం.లో మిడ్ నైట్ 12.30 కి ఈ సినిమా స్పెష‌ల్ షోను వీక్షించ‌నున్నారు. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ టీమ్ 450కి పైగా టికెట్స్‌ను కూడా బుక్ చేశార‌ట‌.

Advertisement

ఓ వైపు ఆర్ఆర్ఆర్ టీమ్ ప్ర‌చారం చేస్తుండ‌గా.. మ‌రొక వైపు ఎవ్వ‌రూ ఊహించ‌లేని స్టార్ల‌తో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మ‌రింత ఆస‌క్తి పెంచేస్తున్నాడు. ఇప్ప‌టికే అనిల్ రావిపూడి, సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి, యాంక‌ర్ సుమ‌ల‌తో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి సంచ‌ల‌న‌మే సృష్టించారు. తాజాగా ఎవ‌రు ఊహించ‌లేని డైరెక్ట‌ర్ అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి జ‌క్క‌న్న‌ను ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ చేయ‌డం విశేషం. మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమా ప్ర‌చారం కోసం చాలా మంది సినీ ప్ర‌ముఖులు ప్ర‌చారాన్ని చేస్తున్నారు. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే ఇంత హ‌డావుడి ఉంటే విడుద‌లైన త‌రువాత ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందోన‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

Also Read :  ఎన్టీఆర్ స్ట్రాంగ్ క్లాస్ పీక‌డంతో లైన్‌లోకి వ‌చ్చిన సినీన‌టులు వీరే.. అస‌లు ఏమి జ‌రిగిందంటే..?

Visitors Are Also Reading