కోట శ్రీనివాసరావు రెండవ కూతురు ఎంకామ్, ఎంబీఏ బెజవాడలో ఎప్పుడు రిక్షా ఎక్కలేదు. రిక్షా ఎక్కుదామని తన తమ్ముడు శంకర్ అక్క కూతుర్లు, చెల్లెలు కూతుర్లు అందరూ కలిసి రిక్షా ఎక్కి సరదాగా బెజవాడ బ్రిడ్జీ వన్ టౌన్ నుంచి టూ టౌన్‌కు వెళ్లుతుండగా ఒక లారీ బ్రేకు ఫెయిల్ అయి డివైడర్‌ను తాకి వాళ్లు వ్యాన్ ను ఢీ కొట్టగానే అందరూ దూరంగా పడిపోయారు. ఆ సమయంలో ముగ్గురు చనిపోయారు. ఆయన రెండవ కూతురు లక్కీగా ప్రాణాపాయం నుంచి బయటపడిందని చెప్పారు కోట శ్రీనివాసరావు.
Advertisement
Read Also : ఆ హీరోయిన్ తో ఎఫైర్..? సమీర్ ను బ్లాక్ చేసిన ఈటీవీ….!
Advertisement
ఆమె జీవితం ఎలా అవుతుందోనని ఆలోచించేవారు. అయితే కోటశ్రీనివాసరావు ఎవరి దగ్గర అయితే గుమస్తాగా పని చేశారో వారికే వియ్యంకులయ్యారు. ఆయన కూతురు సంతోషంగా ఉందని సంతోషపడేలోపే ఆయన కుమారుడు మరణించాడు. కోటశ్రీనివాసరావు అన్నీ బాధలు భరిస్తూనే తన నటన ప్రస్తావనం కొనసాగించారు. ఎక్కడ కూడా తన బాధను చూపించలేదు. దేవుడు తనకు ఎంత పేరు ఇచ్చారో అంతే కష్టాలు ఇచ్చాడు. తనకు ఎప్పుడైనా బోరు కొడితే ఇంట్లో కూర్చుని ఏడ్చేవాడినని చెప్పారు.
సినిమాల్లో ఏ క్యారెక్టర్ అయినా తన బాధ్యతగా ఫీల్ అవుతానని చెప్పారు. తన భార్యను ఎంత బాధ్యతతో చూశారో ఇండస్ట్రీని కూడా అంతే బాధ్యతతో చూశానని తెలిపారు కోటశ్రీనివాసరావు. తనకు మరొక జన్మ ఉంటే కష్టాలు తగ్గించి సుఖాలను ఇచ్చి పది సాయం చేయగలిగే స్థితిని ఇవ్వాలని ఆ దేవుడిని కోరారు. అదేవిధంగా అలా బ్రతాకాలంటే తాను ఎలా ఉండాలో సత్ప్రవర్తన అన్ని కలిసి ఉండాలని దేవున్ని కోరారు.