Home » బ‌ప్పి ల‌హిరి మృతికి కార‌ణం ఏమిటో తెలుసా..?

బ‌ప్పి ల‌హిరి మృతికి కార‌ణం ఏమిటో తెలుసా..?

by Anji
Ad

పాత‌, కొత్త అని తేడా లేకుండా బాలీవుడ్ కాదు బ‌ప్పి ల‌హిరి పాట‌లు తెలుగు నాట కృష్ణ‌, చిరంజీవి, బాల‌య్య‌, మోహ‌న్‌బాబు లాంటి వాళ్ల‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ పాట‌లతో కెరీర్ బూస్ట్ ఇచ్చార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. సంగీత ఐకాన్ మ‌ర‌ణించ‌డం భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌ను, ఆయ‌న పాట‌ల అభిమానుల‌ను దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం వెనుక అబ్ స్ట్ర‌క్టివ్  స్లీప్ అప్పియా కార‌ణం అని వైద్యులు వెల్ల‌డించారు.

ముఖ్యంగా ఆప్నియా అనేది శ్వాస సంబంధించిన వ్యాధి. నిద్ర‌లో ఆగి శ్వాస తీసుకోవ‌డం దీని ల‌క్ష‌ణం. ఇందులో మూడు ర‌కాలుంటాయి. అబ్ స్ట్ర‌క్టివ్ స్లీప్ అప్నియా, సెంట్ర‌ల్ స్లీప్ అప్నియా, కాంప్లెక్స్ స్లీప్ అప్నీయా. వాస్త‌వానికి స్లీప్ అప్నియా చాలా సాధార‌ణ‌మైన వ్యాధి అనుకుంటారు చాలా మంది. కానీ అదే స‌మ‌యంలో ప్రాణాంత‌క‌మైంది కూడా అనేది తెలియ‌దు.

Advertisement

 

నిద్రిస్తున్న స‌మ‌యంలో అప్ప‌ర్ ఎయిర్‌వేస్ బ్లాక్‌కు గుర‌వుతాయి. దీంతో గాలి తీసుకునే మార్గాన్ని అంత వ్యాకోచింప‌చేసి.. గాలిని ఊపిరితిత్తుల్లోకి పంపించ‌డానికి వీలు చాతి కండ‌రాలు బ‌లంగా ప‌ని చేస్తాయి. పెద్ద జెర్కింగ్ చ‌ప్పుడుతో లేచి గాలి తీసుకుంటారు. ఈ స‌మ‌స్య ఉన్న వారు చాలా మందే ఉంటారు. పిల్ల‌ల ద‌గ్గ‌రి నుంచి వృద్ధుల వ‌ర‌కు.. ఓవ‌ర్ వెయిట్ ఉన్న వారికి తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంది.

Advertisement

]సాధార‌ణంగా గాలి ముక్కు, నోరు, ఊపిరితిత్తుల ద్వారా ప్ర‌వ‌హిస్తుంటుంది. నిద్ర‌లో కూడా. శ్వాస‌నాళ కండ‌రాలు మూసుకుపోవ‌డం వ‌ల్ల ఓఎస్ఏ స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. నిద్ర స‌మ‌యంలో గొంతు భాగంలో సాప్ట్ టిష్యూ వ్యాకోచించ‌డం వ‌ల్ల గాలి వెళ్లే మార్గానికీ అడ్డుప‌డుతుంది. దీంతో శ్వాస నాళాల ఎగువ భాగం అడ్డంకి గుర‌వుతుంది. గాలి స‌రిప‌డా అంద‌క‌పోవ‌డంతో లేచి గాలి తీసుకోవాలంటూ మెద‌డు అదే ప‌నిగా సంకేతాలు అందిస్తుంది. దీంతో ఈ స‌మ‌స్య ఉన్న‌వాళ్లు మంచి నిద్ర పోలేరు. ఇది దీర్ఘ‌కాలంలో వారి గుండె ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తుంది.

ల‌క్ష‌ణాలు

 • పెద్ద శ‌బ్దంతో గుర‌క
 • అల‌స‌ట లేమితో ప‌డుకున్న‌ప్పుడు ఉలిక్కి ప‌డి లేచి ఊపిరి పీల్చుకోవ‌డం, ఉక్కిరి బిక్కిరి కావ‌డం.
 • ప‌గ‌టి పూట ఎక్కువ సేపు నిద్ర
 • నిద్ర‌లో శ్వాస‌కు ఆటంకం
 • రాత్రిళ్లు చెమ‌ట‌లు పోయ‌డం
 • పొద్దు పొద్దునే త‌ల నొప్పులు
 • నిద్ర‌లో ప‌దే ప‌దే మేల్కొన‌డం వ‌ల్ల మ‌తిమ‌రుపు, నిద్ర‌మ‌బ్బు మాటిమాటికి ఇరిటేష‌న్
 • పొద్దు పొద్దునే త‌ల‌నొప్పులు
 • నిద్ర‌లో ప‌దే ప‌దే మేల్కొన‌డం వ‌ల్ల మ‌తిమ‌రుపు, నిద్ర‌మ‌బ్బు, మాటిమాటికి ఇరిటేష‌న్
 • పెద్ద‌గా గుర‌క‌పెట్ట‌డం సెస్ అప్నియాకు సంకేతంగా చూడాలి.

ట్రీట్‌మెంట్ ఆప్ష‌న్స్

 • బ‌రువు త‌గ్గించుకోవ‌డం
 • సీపీఏపీ కంటి న్యూయ‌స్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజ‌ర్‌. ఈ పరిక‌రాన్ని వైద్యులు సూచిస్తుంటారు. దీనిని త‌ల‌కు ధ‌రించి ప‌డుకుంటే శ్వాస నాళాల్లోకి పాజిటివ్ ప్రెజ‌ర్‌ను పంపిస్తుంది. దాంతో అవి తెరుచుకుంటాయి. గుర‌క‌రాకుండా, శ్వాస‌కు ఇబ్బంది లేకుండా మంచిగా నిద్ర‌పోవ‌చ్చు.
 • XZ
  *ఒక ప‌క్క‌కు తిరిగి ప‌డుకోవ‌డం బోర్లా ప‌డుకోవ‌డం, ఓఎస్ఏను మ‌రింత దారుణంగా చేస్తుంది.
  అవ‌స‌ర‌మైతే స‌ర్జ‌రీ.

Also Read :  ఆ దేశంలో ల‌వ్ ఎమోజీ పంపితే రూ.20 ల‌క్ష‌ల ఫైన్….!

Visitors Are Also Reading