Telugu News » ఆ హీరోయిన్ తో ఎఫైర్..? సమీర్ ను బ్లాక్ చేసిన ఈటీవీ….!

ఆ హీరోయిన్ తో ఎఫైర్..? సమీర్ ను బ్లాక్ చేసిన ఈటీవీ….!

by AJAY MADDIBOINA

సాధారణంగా సీరియల్స్ లో గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత ఎంతో కష్టపడి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటారు. కానీ నటుడు సమీర్ సీరియల్ నుండి తొలగించడం వల్ల సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతే కాకుండా నటుడిగా ఎంతో సక్సెస్ అయ్యాడు. సమీర్ కెరీర్ ప్రారంభంలో ఈటివి సీరియల్స్ లో నటించేవారు.

Ads

ఈ క్రమంలో నా మొగుడు నాకు సొంతం సీరియల్ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని…..సెట్స్ లోనే హీరోయిన్ తో ఎంజాయ్ చేస్తున్నాడని అప్పట్లో ఆ సీరియల్ ను ఆపేశారు. అంతే కాకుండా సమీర్ ను ఏకంగా ఈటివి నుండి శాశ్వతంగా బ్లాక్ చేశారు. అయితే ఈ విషయం పై సమీర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. హీరోయిన్ తో ఎఫైర్ ఉంటే ఎంజాయ్ చేయడానికి షూటింగ్ లొకేషన్ తప్ప ప్రపంచంలో వేరే చోటు దొరకదా అంటూ ప్రశ్నించాడు.

అది ఎవరో కావాలని చేశారని సుమన్ కనీసం తనను పిలిచి మాట్లాడకుండా సీరియల్ ను ఆపేశారు అని చెప్పారు. అంతే కాకుండా తనను ఈటివి సీరియల్స్ నుండి బ్లాక్ చేశారని అన్నారు. నిజానికి సుమన్ గారి పాదాలకు నమస్కారం పెట్టాలని….ఆయన వల్లే తాను సీరియల్స్ నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చానని అన్నారు. కొంత కాలం తరవాత సుమన్ మళ్లీ ఫోన్ చేసి స్వారి చెప్పారని అన్నారు. దాంతో మీరు కనీసం ఏం జరిగిందో నన్ను అడగాల్సింది అని చెప్పానని అన్నారు. జరగాల్సింది ఏదో జరిగిపోయింది అని ఆ మ్యాటర్ ను అక్కడ తో వదిలేసా అని అన్నారు. తనకు రావాల్సిన చెక్కులు కూడా ఇవ్వలేదని సమీర్ ఆవేదన వ్యక్తం చేశారు.


You may also like