Home » భారత్ లో అత్యంత ధనవంతులైనటువంటి దర్శకులు వీళ్లే..!

భారత్ లో అత్యంత ధనవంతులైనటువంటి దర్శకులు వీళ్లే..!

by Anji
Ad

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాకు కీలక పాత్ర పోషించేంది దర్శకుడు. అతని ఆలోచనలు అద్భుతంగా ఉంటేనే ఒక మంచి చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి అందరి మన్ననలు పొందుతాడు. ఇక భారతీయ సినీ పరిశ్రమలో ముఖ్యంగా అత్యంత ధనవంతులు అయినటువంటి దర్శకులు ఎవరబ్బా అని ఆలోచిస్తుంటారు. ప్రధానంగా స్క్రీన్ పై అభిమానులకు వినోదాన్ని అందిస్తూ.. కోట్ల రూపాయలు సంపాదించిన డైరెక్టర్లను మనం వేళ్ళ మీదనే లెక్క పెట్టవచ్చు. భారత్ లో  ధనవంతులైనటువంటి దర్శకులు ఎవరో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. 

Advertisement

తాజాగా జీ క్యూ ఇండియా ధనవంతులైనటువంటి దర్శకుల జాబితాను తాజాగా ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా  వెల్లడించింది. టాలీవుడ్ కి చెందిన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మాత్రమే ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ గురించి బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలో  ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన  అవసరం లేదు. ప్రధానంగా  సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి  కరణ్ జోహార్ కూడా ఫేమస్ అయ్యారు. 

Advertisement

Also Read :  పవన్ 3 పెళ్లిళ్లపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు! 

Manam News

దాదాపు రూ. 1640 కోట్లతో కరణ్ జోహార్  తొలి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో రాజకుమార్ హిరాణి రూ. 115 కోట్లతో నిలువగా.. మూడో స్థానంలో రూ. 900 కోట్లతో సంజయ్ లీలా  భన్సాలి ఉన్నారు. ఇక ఆ తర్వాత వరుసగా రూ. 720 కోట్లతో అనురాగ్ కశ్యప్, రూ.300 కోట్లతో కబీర్ ఖాన్, రూ. 250 కోట్లతో రోహిత్ శెట్టి, రూ. 158 కోట్లతో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, రూ. 76 కోట్లతో జోయా అక్కర్ లు  అగ్రస్థానంలో నిలిచారు.  దక్షిణాది దర్శకుడు శంకర్ కూడా ఈ లిస్ట్ లో ఉంటాడనుకుంటే.. అతని పేరు ఇందులో లేకపోవడం గమనార్హం. 

Also Read :  వీరసింహారెడ్డి సినిమా డైలాగ్స్ పై ఏపీ సర్కార్ సీరియస్….చర్యలు తప్పవా….?

 

Visitors Are Also Reading