Home » రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌.. వ‌న్డేల్లో ట్రిపుల్ సెంచ‌రీ..!

రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌.. వ‌న్డేల్లో ట్రిపుల్ సెంచ‌రీ..!

by Anji
Ad

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న అంధుల వ‌న్డే క్రికెట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆట‌గాడు ప్ర‌పంచ రికార్డును సృష్టించాడు. కామ‌న్‌వెల్త్ బ్యాంకు సిరీస్‌లో భాగంగా కివీస్‌తో జ‌రిగిన ఫ‌స్ట్ వ‌న్డే మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టెఫ‌న్ నీరో ఏకంగా ట్రిపుల్ సెంచ‌రీ చేసి చరిత్ర సృష్టించాడు. టీ-20ల ప్ర‌భావం కార‌ణంగా వ‌న్డేల్లో డ‌బుల్ హండ్రెడ్ చేయ‌డ‌మే గ‌గ‌నం అయిన ఈ రోజుల్లో ఓ అంధ క్రికెట‌ర్ ట్రిపుల్ సెంచ‌రీ సాధించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు.


కివీస్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో ఆసీస్ ఆట‌గాడు స్టెఫ‌న్ నీరో కేవ‌లం 140 బంతుల్లో 49 ఫోర్లు, సిక్స‌ర్ సాయంతో 309 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీని ఫ‌లితంగా ఆసీస్ జ‌ట్టు నిర్ణీత 40 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 542 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. అనంత‌రం ఛేద‌న‌కు దిగిన కివీస్ కేవ‌లం 272 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. ఫ‌లితంగా ఆస్ట్రేలియా 270 ప‌రుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ ను మ‌ట్టిక‌రిపించింది.

Advertisement

అంధుల వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో ట్రిపుల్ సెంచ‌రీ సాధించ‌డం ద్వారా స్టెఫెన్ నీరో ప్ర‌పంచ రికార్డు బ‌ద్ద‌లు కొట్టాడు. 1998లో పాక్ బ్యాట‌ర్ మ‌సూద్ జాన్ చేసిన 262 ప‌రుగులే అంధుల వ‌న్డే క్రికెట్‌లో టాప్ స్కోర‌ర్‌గా ఉండింది. తాజాగా నీరో విధ్వంసంతో మ‌సూద్ జాన్ రికార్డు బ‌ద్ద‌లు అయింది. 5 టీ-20లు, 3 వ‌న్డేల ఈ సిరీస్లో నీరో ఇప్ప‌టికే రెండు సెంచ‌రీలు 113, 101 సాధించ‌డం విశేషం. కివీస్‌పై వ‌న్డేల్లో ట్రిపుల్ సెంచ‌రీ చేయ‌డంతో నీరో మ‌రొక రికార్డును కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా త‌రుపున ఈ ఘ‌న‌త సాధించిన ఎనిమిద‌వ క్రికెట‌ర్ గా నీరో రికార్డుల్లోకి ఎక్కాడు. మాథ్యూ హెడెన్, మైకెల్ క్లార్క్‌, డేవిడ్ వార్న‌ర్ వంటి దిగ్గ‌జ ఆట‌గాళ్లు ప‌లు ఫార్మాట్ల‌లో ట్రిపుల్ సెంచ‌రీల‌ను సాధించారు.

Also Read :

పెళ్లి జ‌రిగిన ఎనిమిదేళ్ల‌కు భార్య‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భ‌ర్త‌…. ఆ స‌ర్‌ఫ్రైజ్ తో అంద‌రూ ఆశ్చ‌ర్యం..!

తల్లికి సాటి ఎవరు..?ఈ వీడియో చూస్తే మీ తల్లి గుర్తుకు వస్తుంది..!!

Visitors Are Also Reading