ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలోని ఆదిలాబాద్ లో విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ లోని ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ముఖ్యంగా మోడీకి కుటుంబం లేదని ప్రతిక్షాలు విమర్శిస్తున్నాయని.. మోడీ జైలుకు వెళ్లలేదని, రాజకీయాలు రావని అంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలారా నా జీవితం ఒక తెరిచిన పుస్తకం అని పేర్కొన్నారు మోడీ. ఓ లక్ష్యంతో చిన్నతనంలోనే ఇంటిని వదిలి వెళ్లానని.. దేశ ప్రజల కోసం జీవించాలన్న స్వప్నంతో ఇళ్లు విడిచి వెళ్లినట్లు ప్రధాని తెలిపారు.
Advertisement
తన జీవితంలో ప్రతి క్షణం కేవలం ప్రజలకే కేటాయించినట్లు చెప్పారు. మీ స్వప్నాలే నా సంకల్పం అవుతుందని ఆయన ప్రజలను ఉద్దేశంచి అన్నారు. మీ పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా మార్చనున్నట్లు చెప్పారు. అందుకే దేశ ప్రజలు తనను స్వంత మనిషిలా చూస్తారని, కుటుంబ వ్యక్తిలా ప్రేమను పంచుతారని, అందుకే 140 కోట్ల మంది దేశ ప్రజలే నా కుటుంబం అని ప్రధాని మోడీ అన్నారు. దేశంలోని ప్రతి పేద తన కుటుంబమే అన్నారు. పిల్లలు, పెద్దలు, అనాథలు అందరూ తనవారే అన్నారు. మేరా భారత్, మేరా పరివార్ అని ప్రధాని మోడీ తెలిపారు. దేశమే కుటుంబం అన్న సంకల్పంతో ప్రజల కోసం జీవిస్తున్నానని మోడీ వెల్లడించారు.
Advertisement
దేశం ఇప్పుడు ఒకే స్వరంతో .. మై హూ పరివార్ అని అంటోందన్నారు. నేనే మోడీ కుటుంబం అని అంటోందని ఆయన పేర్కొన్నారు. మై హూ మోడీ పరివార్ అని సభకు వచ్చిన ప్రజలతో మోడీ పలికించారు. తెలంగాణ ప్రజలకు ఓ సందేశం ఇవ్వాలనుకుంటున్నానని, గర్వంతో నిండిన ప్రజలకు చెబుతున్నానని, రామ మందిరంలో బంగారు దర్వాజాలు, ఆ మందిరంలోని స్తంభాల్లో తెలంగాణ పాత్ర ఉందన్నారు. యావత్ తెలంగాణ ప్రజల పట్ల దేశం ధన్యవాదాలు వ్యక్తం చేస్తోందన్నారు. రామ్‌లల్లా ఆశీర్వాదం తెలంగాణ ప్రజలపై ఉందన్నారు. సమృద్ధి దేశాల సరసన ఇండియాను నిలపనున్నట్లు చెప్పారు. లాల్ ప్రసాద్ యాదవ్ మోడీ గురించి మోడీకి కుటుంబం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మోడీ పరివార్ గా కేంద్ర మంత్రులు అందరూ మోడీ డీపీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Also Read : రామ్ చరణ్ సూపర్ హిట్ సినిమాలో ఈ సీన్ ఎన్టీఆర్ సినిమా నుంచి కాపీ చేసారా ?