Home » ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెన్ను.. దీని గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా ..!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెన్ను.. దీని గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా ..!

by Anji
Ad

సాధారణంగా ఈ రోజుల్లో డబ్బుకు అస్సలు విలువ లేదు.. లేకపోతే ఓ చిన్న పెన్ను ఖరీదు కోట్ల రూపాయలా..? అయితే ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పినా కానీ అంతా నమ్మరు. కానీ ఇది అక్షరాల వాస్తవం. ఈ పెన్ను ఖరీదు అక్షరాల 8 మిలియన్ డాలర్లు.. భారత కరెన్సీ ప్రకారం అయితే.. రూ.66.6 కోట్లు అన్నమాట. అది వజ్రాలు పొదిగిన పెన్ను. 

Advertisement

ప్రపంచవ్యాప్తంగా అరుదైన, పురాతన వస్తువులను అక్కడక్కడా వేలం వేస్తూ ఉంటారు. ఎంత పాతదైతే అంత డబ్బు .. అలాగే తాజాగా ఓ పెన్ను కూడా వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. ఒక అరుదైన పెన్ను వేలం వేయగా 8 మిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.66.6 కోట్లు పలికి.. వార్తల్లో నిలిచింది. అంత కాస్ట్లీ అయితే పక్కాగా రికార్డు వస్తుందిగా ..వచ్చింది. ఈ పెన్ను పేరు ఫుల్గోర్ నోక్టర్నస్. ఇది లాటిన్‌ పేరు కాగా.. దానికి నైట్‌ గ్లో  అని అర్థం. నల్ల వజ్రాలు పొదిగిన ఈ ఫౌంటెన్ పెన్‌ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Advertisement

అద్భుతమైన బ్లడ్‌ రెడ్‌ కెంపులు పెన్ను క్యాప్‌ని అందంగా అలంకరించి ఉంటాయి. ఈ పెన్నులో మొత్తం 945 నల్ల వజ్రాలు, 123 కెంపులు పొదిగి ఉన్నాయి. ఇక ఈ పెన్ను నిబ్‌ను 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. 2020లో ఫుల్గోర్ నోక్టర్నస్‌ పెన్ను షాంఘైలో వేలం వేయగా అది 8 మిలియన్‌ డాలర్లు పలికింది. ఇంతవరకూ ఏ ఐటమ్ కు ఈ స్థాయి వేలం జరగలేదు. కానీ  ఈ పెన్ను చూసిన వారు మాత్రం చాలా అద్భుతమైనది   అని అంటున్నారు.

Visitors Are Also Reading