రోజు రోజుకు ఓ వైపు నిత్యవసర ధరలు, మరొక పెట్రోల్, డిజీల్ ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో వాహనదారులు ఎలక్ట్రికల్ బైకుల వైపు ఆసక్తి కనబరుచుతున్నారు. ఇటీవల వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతూ అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.
Advertisement
ఈ తరుణంలో తమిళనాడులోని ఓ వ్యక్తి చాలా ఆగ్రహానికి లోనై తన ఎలక్ట్రిక్ బైకుపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తిరుపత్తూర్ జిల్లా అంబూరుకు చెందిన ఓ వాహనదారుడు చాలా కాలం కిందట ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బైకు కొనుగోలు చేసాడు. గత మూడు నెలల్లో మూడు సార్లకు పైగా తన ఎలక్ట్రిక్ బైకు రిపేర్‌కు గురికావడంతో వాహనదారుడు ఆగ్రహానికి గురయ్యాడు.
Advertisement
దీంతో జనాలందరూ చూస్తుండగా.. పెట్రోల్ పోసి తన వాహనానికి నిప్పు పెట్టాడు. కొనేటప్పుడు 100 కిలోమీటర్లు మైలేజ్ వస్తుందని.. కనీసం 40 కిమీ మైలేజ్ కూడా రావడం లేదని సదరు వాహనదారుడు వాపోయాడు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఆ సంస్థ పట్టించుకోలేదని.. అందుకే బైకును కాల్చేసినట్టు బాధితుడు తన బాధను తెలిపాడు.
Also Read :
Tollywood: ఎన్టీఆర్ నుండి పవన్ వరకు రెండు పెళ్లిల్లు చేసుకున్న తెలుగు నటులు ఎవరో తెలుసా ?