Home » ఊరి పేరునే సినిమా టైటిల్స్ గా పెడుతున్న మేకర్స్…!

ఊరి పేరునే సినిమా టైటిల్స్ గా పెడుతున్న మేకర్స్…!

by Bunty
Ad

 

సినీ ప్రియులకు అదిరిపోయే విధంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలతో మన హీరోలు ముందుంటారు. తమ అభిమాన హీరో సినిమా వచ్చిందంటే చాలు ఎగబడి చూస్తుంటారు. సినిమా పేరేంటి? హీరోయిన్ ఎవరు? అనే విషయాలను కూడా పెద్దగా పట్టించుకోరు. ఈ మధ్యకాలంలో సినిమాలకు ఎక్కువగా ఊర్ల పేర్లను పెడుతున్నారు. స్టార్ హీరోలు కూడా వారు నటించే సినిమాలకు ఊర్ల పేర్లను టైటిల్స్ గా పెడుతున్నారు. మరి ఊర్ల పేర్లతో మన ముందుకు వచ్చిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం….

Advertisement

వాల్తేరు వీరయ్య, ఒంగోలు గిత్త, గుంటూరు వంటి ఊర్ల పేర్లతో ఒకప్పుడు ఈ సినిమాలు వచ్చాయి. ఊర్ల పేర్లనే సినిమా టైటిల్స్ ల పెట్టారు. దీంతో అలాంటి ఊర్లకు చాలా డిమాండ్ పెరిగింది. ఒక ప్రాంతాన్ని ఆదర్శంగా తీసుకుని దానిపై సినిమా కథలు రాస్తున్నారు మేకర్స్. అందుకే అలానే టైటిల్స్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. తాజాగా విశ్వక్సేన్ సినిమాకు “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా పూర్తిగా గోదావరి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అలాగే శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న గీత ఆర్ట్స్ 2 నిర్మాణంలో వస్తున్నటువంటి సినిమాకు “కోటబొమ్మాలి” అనే టైటిల్ ని పెట్టారు.

Advertisement

ఆ ఊరి పోలీస్ స్టేషన్లో జరిగేటువంటి కథ ఇది. ఇక ఈ మధ్య సందీప్ కిషన్ “ఊరు పేరు భైరవకోన” అనే సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నాగ శౌర్య “రంగబలి” సినిమాతో మన ముందుకు వచ్చారు. కార్తికేయ కొత్త సినిమా “బెదురులంక 2012” అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇది కూడా ఒక ఊరు నేపథ్యంలో సాగేటువంటి కథ. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా సైతం గుంటూరు నేపథ్యంలో రాబోతుంది. ఈ సినిమాకి “గుంటూరు కారం” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. మొత్తంగా ఊర్ల పేర్లతోనే సినిమాలకి టైటిల్స్ ని పెట్టేస్తున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి : 

ICC World Cup 2023 : వరల్డ్‌ కప్‌ జట్టులోకి మన తెలుగోడు..మరో యువరాజ్‌ లా ఎంట్రీ !

మోడీ ప్రభుత్వంతో…. ఒక రోజు జగన్ ను ఆట ఆడిస్తాను – పవన్ వార్నింగ్

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో నటించిన అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్…!

Visitors Are Also Reading