పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన సినిమా మరియు పొలిటికల్ కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో ఆయన నటవారసుడిగా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి అడుగు పెట్టారు. ఇకపోతే పవన్ కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ అనే చాలామందికి తెలిసినా విషయమే. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న పవన్ కళ్యాణ్ కి అసలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే అవసరమేంటి అని చాలా మంది తరచుగా ఆలోచిస్తుంటారు.
Advertisement
పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం వంటి చిత్రాల్లో నటించిన స్టార్ హీరో రేంజ్ లో మాత్రం ఇమేజ్ సొంతం అవ్వలేదు. కాని ఏ హీరో కైనా వాళ్ల కెరియర్ లో టర్నింగ్ పాయింట్ ఇచ్చే ఒకే ఒక సినిమా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కి హీరో నుంచి స్టార్ హీరోగా కెరియర్ ని మలుపు తిప్పిన చిత్రం తమ్ముడు.
పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ తమ్ముడు అని చెప్పవచ్చు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బాక్సర్ గా ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన రియల్ స్టంట్ వలన ఆయనను అభిమానించే ప్రేక్షకుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కిక్ బాక్సింగ్ నేర్చుకోవడానికి రాత్రి మొత్తం వర్షం లో తడుస్తూ తనకి కిక్ బాక్సింగ్ మీద ఉన్న ఇష్టాన్ని చూపించారు .అయితే పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టపడి నటించిన తమ్ముడు చిత్రం ఆయన రియల్ లైఫ్ స్టోరీ అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా ఇండస్ట్రీకి రాకముందు చెన్నైలోని కరాటే మాస్టర్ షెహాని హుస్సేన్ దగ్గర కరాటే నేర్చుకోవడానికి వెళ్లారట. అందుకుగాను ఆ కరాటే మాస్టర్ పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు నేను ఖాళీగా లేను, అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కరాటే నేర్పించడం మానేశానని పవన్ ని అక్కడ నుంచి వెళ్లిపోమన్నారట .కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నేను కరాటే నేర్చుకుంటే మీ దగ్గరే నేర్చుకుంటాను అని మొండి పట్టుదలతో అక్కడే ఉండిపోయారట.
Advertisement
ఈ క్రమంలోనే కరాటే మాస్టర్ షెహాని హుస్సేన్ ఓ రోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11:00 వరకు నా దగ్గరే ఉండు.. నాకు సమయం దొరికినప్పుడు అర్థగంట నీకు కరాటే నేర్పిస్తాను అంటూ చెప్పుకొచ్చారట మాస్టర్. కరాటే మాస్టర్ చెప్పిన విధంగానే పవన్ కళ్యాణ్ నిజంగానే 15 రోజులపాటు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆయన దగ్గరికి వెళ్లారట . పవన్ కి కరాటే పై ఉన్న ఆసక్తిని చూసి ముచ్చట పడిన ఆయన సంవత్సరం పాటు కోచింగ్ ఇచ్చారట. పవన్ కళ్యాణ్ కూడా ఎంతో పట్టుదలతో కరాటే నేర్చుకొని బ్లాక్ బెల్ట్ కూడా పొందారు . కానీ కొన్ని నెలలకు తర్వాత ఆయనకి కల్యాణ్ ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అని తెలిసిందట. ఇక పవన్ నటించిన తమ్ముడు సినిమా కూడా అచ్చు ఆయన రియల్ లైఫ్ లో జరిగిన స్టోరీ లానే ఉంటుంది. అలా పవన్ కళ్యాణ్ లైఫ్ లో జరిగిన రియల్ స్టోరీ.. రీల్ స్టోరీ గా మారి పవన్ కళ్యాణ్ కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అయింది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పవన్ కళ్యాణ్, నమ్రత కాంబినేషన్లో మిస్ అయిన మూవీ ఏదో తెలుసా.!
సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ 5 హీరోలు వీళ్ళే..!
‘బేబి’ వంటి గోల్డెన్ ఛాన్స్ ని ఈ యంగ్ హీరో మిస్ చేసుకున్నాడా ?