పాఠశాలల్లో, కళాశాలల్లో, యూనివర్సిటీలలో పరీక్షలు నిర్వహించేటప్పుడు విద్యార్థులకు సాదారణంగా ప్రశ్న పత్రాలు ఇస్తుంటారు. కానీ ఓ యూనివర్సిటీలో మాత్రం ప్రశ్న పత్రానికి బదులుగా సమాధానాల కీ ఇచ్చేసారు. ఇదే మంచి అవకాశంగా భావించిన ఓ విద్యార్థి ఏం చక్కగా ఆన్సర్లు రాసి పరీక్ష హాల్ నుండి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసిన యూనివర్సిటీ ఆ పరీక్షను రద్దు చేసినది. ఈ అరుదైన ఘటన మరెక్కడో కాదు.. కేరళ యూనివర్సిటీలో చోటు చేసుకున్నది.
Advertisement
కరోనా మూలంగా బీఎస్పీ ఎలక్ట్రానిక్స్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఎగ్జామ్స్‌కు హాజరుకాని ఓ విద్యార్థి కోసం మళ్లీ ఆ పరీక్షను నిర్వహించారు. ఆ విద్యార్థికి క్వశ్ఛన్ పేపర్ ఇవ్వకుండానే ఆన్సర్ కీ ఇచ్చేసారు. ఆ ఇన్విజిలెటర్ గుర్తించలేదు. ఆ విద్యార్థి ఆన్సర్ కీ ని నింపేసి ఇచ్చి వెళ్లాడు. ఈ పరీక్ష ఫిబ్రవరి నెలలో జరిగింది. అయితే ఆ విద్యార్థి పేపర్‌ను దిద్దిన ప్రొఫెసర్ జరిగిన పొరపాటును గుర్తించి.. యూనివర్సిటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ పరీక్షను యూనివర్సిటీ రద్దు చేసి మే 03న మరొక సారి నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
Advertisement
ఇలాంటి సంఘటనే కేరళలోని కన్నూర్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. థర్డ్ సెమిస్టర్ వృక్షశాస్త్రంకు సంబంధించిన పరీక్షలో ఈ పొరపాటు జరిగింది. గత ఏడాది ప్రశ్న పత్రాలను విద్యార్థులకు అందజేశారు. దీని కంటే ముందు పాత సంవత్సరం ప్రశ్న పత్రాలను అందజేశామని గుర్తించి.. రెండు బీఎస్సీ సైకాలజీ పరీక్షలను యూనివర్సిటీ రద్దు చేసింది. ఇలా రెండు, మూడు సార్లు పరీక్షలు నిర్వహించడంపై కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ నివేదికలు అందించాలని కోరారు. నివేదికల ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు.
Also Read :
కేజీఎఫ్ ఛాప్టర్ -2 అంతటా ఫుల్ కలెక్షన్లు.. అక్కడ మాత్రం అంతంతే..?