ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక చిన్న గొడవతో ఒక జవాన్ తోటి సైనికులపై కాల్పులు జరపడంతో నలుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) జవాన్లు మరణించారు. అలాగే ఈ ఘటనలో మరో ముగ్గురు జవాన్ లు గాయపడ్డారు అని ఆర్మీ అధికారులు తెలిపారు. మారాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగన్‌పల్లి గ్రామంలోని సీఆర్పీఎఫ్ 50వ బెటాలియన్ క్యాంపులో తెల్లవారుజామున 3.45 గంటలకు రీతేష్ రంజన్ అనే జవాన్ తోటి సైనికులపై కాల్పులు జరిపాడు.
Advertisement
Advertisement
ప్రాథమిక సమాచారం ప్రకారం, జవాన్ తన సర్వీస్ రైఫిల్ ఏకే-47 రైఫిల్‌తో కాల్పులకు దిగాడు అని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్రాజ్ పి మీడియాకు వివరించారు. ఈ ఘటనలో ఏడుగురు సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులను కానిస్టేబుళ్లు రాజమణి కుమార్ యాదవ్, రాజీబ్ మోండల్, ధంజీ మరియు ధర్మేంద్ర కుమార్‌లుగా గుర్తించారు. దీపావళి సెలవల విషయంలో జరిగిన గొడవతోనే ఈ దారుణం జరిగిందని తెలుస్తుంది.