సాధారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. రోజు అంతా ఎంతో కష్టపడి అలిసిపోయి వచ్చినా కూడా కొంత మందికి అస్సలు నిద్రపట్టదు. శరీరానికి నిద్ర చాలా అవసరం. ఎంతో కష్టపడితే కానీ ఆ రోజంతా నిద్రపోతే శారీరక శ్రమంతా మరిచిపోయి ఎంతో యాక్టివ్ గా తయారవుతుంటారు. నిద్ర అనేది మనిషికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ విషయం మరోసారి రుజువు అయింది. రోజు నిద్ర పోకుంటే మానవుడి మెదడు ఒకటి నుంచి రెండేళ్ల వయస్సు పెరిగినట్టు ప్రవర్తిస్తుందని తాజా పరిశోధనల్లో బయటపడింది.
Also Read : టీ 20లో ఆల్ టైమ్ గ్రెటెస్ట్ ప్లేయర్ అతడే.. విరాట్ ని ఆశ్చర్యపరిచిన బెస్ట్ ఫ్రెండ్..!
Advertisement
జనరల్ ఆఫ్ న్యూరో సైన్స్ పరిశోధన ఫలితాల్లో ఈ శాతం విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిద్రలేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. 134 మందిపై ప్రయోగం చేసి ఈ ఫలితాలను కనుక్కున్నారు. అయితే ఒకరోజు నిద్రపోకపోతే మెదడులో చాలా మార్పులు వస్తాయనే విషయం వెలుగులోకి వచ్చింది. మెదడు నిర్మాణంలో చోటు చేసుకున్న పరిమాణాలు సహజ స్థితికి రావాలంటే కనీసం కొన్ని గంటల పాటు నిద్ర కచ్చితంగా పోవాల్సి ఉంటుంది. నిద్ర లేని రోజున వారు విశ్లేషించిన శాస్త్రవేత్తలు వారు ఒకటి నుంచి రెండేళ్ల వయసు పెరిగినవారుగా ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తారట. దాదాపు 134 మంది పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారిని శాంపిల్ తీసుకొని ఈ పరిశోధన చేపట్టినట్టు స్పష్టమవుతోంది.
Advertisement
వయసులో ఉన్నటువంటి ఆడ, మగ వారిని ఈ పరిశోధనలో శాంపిల్ గా పరిశోధన చేశారు. వారిలో కొందరు మూడు గంటలు, మరికొందరు ఐదు గంటలు, కొందరు ఎనిమిది గంటలు అసలు నిద్ర లేకుండా ఉంచి ఈ పరిశోధన చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆ తర్వాత నిద్రపోవడంతో మళ్లీ వారి మెదడు సాధారణ స్థితికి వచ్చినట్లు తేలింది. రోజుల తరబడి నిద్రపోకపోతే మాత్రం మానసికంగా అత్యంత చెడు పలితాలను కలిగిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకటి లేదా రెండు రోజులు నిద్ర లేకుంటే ఆ తర్వాత నిద్రపోతే మెదడు సాధారణ స్థితికి చేరుకుంటుంది. కాబట్టి పూర్తిగా నిద్ర లేకుండా అస్సలు ఉండకూడదు. మనిషికి నిద్ర చాలా అవసరం అని గుర్తుంచుకోవాలి.
Also Read : వివాహితులకు ఒడిబియ్యం పోయడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా ?