Home » ‘లియో’ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే.. విజయ్ ఫ్యాన్స్ కి పండుగే..!

‘లియో’ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే.. విజయ్ ఫ్యాన్స్ కి పండుగే..!

by Anji
Ad

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఇప్పటికే మాస్టర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విక్రమ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన తరువాత మరోసారి ఈ క్రేజీ కాంబోలో సెట్ అవ్వడం, షూటింగ్ కొనసాగుతుండటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. త్వరలోనే ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్స్ అందనున్నాయని టాక్ వినిపిస్తోంది. తాజాగా లోకేష్ కనగరాజ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించి.. ఈ మూవీ నుంచి రాబోయే అప్ డేట్స్ ని ఉద్దేశిస్తూ.. రెడీ హా అంటూ ట్వీట్ చేశారు. 

Advertisement

దీంతో అభిమానులు ఎలాంటి అప్డేట్ వస్తుందని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వయంగా దర్శకుడు లోకేష్ స్పందిస్తూ.. ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్టు తెలపడం విశేషం. జూన్ 22న విజయ్ దళపతి పుట్టిన రోజు సందర్భంగా ఈ అప్డేట్ విడుదల చేయనున్నట్టు సమాచారం. అల్టర్ ఇగో నా రెడీ పేరిట ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చాలా ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం సమకూర్చుతున్నారు. 

Advertisement

 

దాదాపు ఒక నిమిషం 14 సెకండ్ల నిడివి ఉన్న పవర్ ఫుల్ గ్లింప్స్ కూడా ఒకటి రానున్నట్టు సమాచారం. ఫ్యాన్స్ కి ఇది బిగ్ ఫీస్ట్ కానుందని తెలుస్తోంది. గతంలో వచ్చిన ఫ్రీ లుక్ పోస్టర్, టైటిల్ లోగో, పవర్ పుల్ వీడియోకి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక సినిమాలో విజయ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారట. చాక్లెట్ తయారు చేసే వ్యక్తిగా కూడా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కొనసాగుతుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఈ సినిమాని రూ.300 కోట్ల వరకు పెట్టుబడితో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, ప్రియా ఆనంద్ తదితరులు నటిస్తున్నారు. 

Visitors Are Also Reading