ఐపీఎల్-15కు సన్నద్ధమవుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా ఆడే తొలి ఐదు మ్యాచ్‌లకు ఫ్యాట్ కమిన్స్ ఆరోన్‌ఫించ్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఈమేరకు ఆ జట్టు మెంటార్ డేవిడ్ హస్సి వెల్లడించాడు. ఇది ప్రతికూల అంశమే. ఏ జట్టు అయినా అత్యుత్తమ ఆటగాళ్లు అందుబాటులో ఉండాలని అనుకుంటుంది. కానీ అంతర్జాతీయ ఆటగాళ్లకు కొన్ని పరిమితులుంటాయి. ప్రతీ క్రికెటర్ తమ దేశం తరుపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకుంటాడు. ఈ తరుణంలో వారికి కొన్ని బాధ్యతలుంటాయి.
Also Read : అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడుతారో తెలుసా..?
Advertisement
Advertisement
కమిన్స్, పించ్ తొలి ఐదు మ్యాచ్‌లకు దూరమవుతారని అనుకుంటున్నా.. వాళ్లు నాణ్యమైన ఆటగాళ్లు వచ్చారంటే డ్రెస్సింగ్ రూమ్‌లో సులువుగా కుదురుకుంటారని హస్సీ అన్నాడు. ఆస్ట్రేలియా ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉంది. ఈ పర్యటన ఏప్రిల్ 05తో ముగుస్తుంది. ఆస్ట్రేలియా బౌలర్ ఆండ్రూ టైని జట్టులోకి తీసుకుంది లక్నో సూపర్ జెయింట్స్. మోచేతి గాయంతో ఐపీఎల్ నుంచి దూరమైన ఇంగ్లాండ్ పేసర్ మార్క్‌వుడ్ స్థానంలో ఇతడిని భర్తీ చేయనుంది. దాదాపు 27 ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడిన టై 40 వికెట్లు సాధించాడు. ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2022లో తన తొలి మ్యాచ్‌లో మొయిన్ అలీ సేవలను కోల్పోయే విధంగా కనిపిస్తోంది. టోర్నీ కోసం మొయిన్‌కు ఇంకా వీసా లభించలేదు. శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌తో చెన్నై టైటిల్ వేల ప్రారంభమవుతుంది. ఒకవేళ మొయిన్ సమయానికి రాకపోతే న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వె ఐపీఎల్ ఆరంగేట్రం చేసే అవకాశముంది. మొయిన్ నిరుడు ఐపీఎల్‌లో 15 ఇన్నింగ్స్‌ల్లో 357 పరుగులు చేశాడు. ఆరు వికెట్లు తీశాడు.
Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాక్…చరణ్ కే ఎక్కువ మార్కులు వేసిన విజయేంద్రప్రసాద్…!