ఆచార్య చాణక్యుడు గొప్ప జీవిత కోచ్‌గా పేరు పొందాడు. తన ప్రత్యేకత విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. గొప్ప వ్యూహ కర్తగా భావించే చాణక్యుడి భావించే చాణుక్యుడి వల్ల నంద వంశం నాశమైంది చాణక్యుడికి రాజకీయాలే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి విషయమై లోతైన జ్ఞానం ఉంది. ఆచార్య చాణక్య నీతిశాస్త్రం అనే పుస్తకంలో ఆర్థిక విషయాల గురించి కూడా ప్రస్తావించారు. చెడ్డ అలవాట్ల వల్ల జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు. ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యే అలవాట్లను మానుకోవాలని చెప్పాడు. వాటి గురించి తెలుసుకుందాం.
Advertisement
అవమాన ఖర్చులు
చాణక్యుడి ప్రకారం.. అందరూ ఆదాయానికి అనుగుణంగా ఖర్చు చేయాలి. తరుచుగా ప్రజలు తమ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. ఈ అలవాటు వల్ల ఒక్కోసారి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆచార్య చాణక్యుడు డబ్బు పొదుపు చేయాలని చెబుతాడు. ఎందుకంటే ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుందని సూచించాడు.
డబ్బు వృధా చేయకండి
చాణక్య నీతి ప్రకారం సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవి చంచల స్వభావం కలది. ఎప్పుడూ ఒకేచోట నిలవదు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ధనం లభించినట్టయితే ఆ డబ్బు వృధా చేయకూడదు. తప్పుగా ఉపయోగిస్తే దాని ఉనికి అంతమవుతుందని చెప్పారు.
Advertisement
ఆర్థిక సంక్షోభం
చాలా సార్లు ప్రజలు ఆర్థిక సంక్షోభాన్నిఎదుర్కొంటారు. వారు తమ సమస్యలను ఇతరులతో షేర్ చేసుకుంటారు. అయితే ఆర్థిక సమస్యలను జీవిత భాగస్వామితో తప్ప వేరే వారితో పంచుకోకూడదు ఆచార్య చెబుతున్నాడు. ఎందుకంటే ఇతరులతో సమస్యల గురించి చర్చించడం వల్ల ఆర్థిక సంక్షోభం మరింత పెరుగుతుందని తెలివైన వ్యక్తి ఎప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని రహస్యంగా ఉంచుతాడు అని సూచించాడు.
ఆలస్యంగా నిద్ర లేవడం
చాలా మందికి ఉదయం లేటుగా లేవడం అలవాటు. ఆచార్య చాణక్య ప్రకారం.. ఆలస్యంగా లేవడం, ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తుంది. ఎక్కువ సేపు పడుకోవడం వల్ల దరిద్రం తాండవిస్తుంది. రోజు అంతా ఏదో ఒక కారణం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండదు. కాబట్టి త్వరగా లేవడానికి ప్రయత్నించాలని చెప్పాడు. ప్రతిరోజూ సాధ్యం కాకపోతే కనీసం వారానికి మూడు సార్లు అయినా ఉదయం లేవడానికి ప్రయత్నిస్తే మంచిది అని చెప్పాడు.
Also Read : తగ్గేదే లేదంటున్న చిన్నోడు.. వైరల్‌గా మారిన బుడ్డొడి ఇన్‌స్టా రిల్స్