ప్రస్తుత కాలంలో కొంతమంది అధికారులు లంచం ఇస్తే కానీ ఏ పని ముట్టడం లేదు. లంచం తీసుకోవడం నేరమని తెలిసినా అవేవీ పట్టించుకోకుండా అందిన కాడికి దోచేసుకుంటున్నారు. మరి లంచం అడిగింది పేదవారా, ధనికులా అనే విషయం తెలుసుకోకుండా ప్రజల రక్తం తాగుతున్నారు.. తాజాగా ఒక రైతు దగ్గర లంచం అడిగిన అధికారికి, చాలా డిఫరెంట్ షాకిచ్చారు రైతు.మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..
కర్ణాటక రాష్ట్రంలోని సీఎం సొంత జిల్లా అయిన హవేరిలో మున్సిపల్ ఆఫీసుకు రైతు ఎద్దును తీసుకెళ్లిన ఘటన సంచలనం రేపింది. సవనూరు మున్సిపాలిటీకి చెందిన ఎల్లప్ప రానోజీ ఒక పేద రైతు. తన సమస్య నిమిత్తం మున్సిపల్ రికార్డుల్లో మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ పని జరగాలంటే లంచం ఇవ్వాలని అధికారి కోరడంతో ఆ రైతుకు డబ్బు సమకూర లేదు. చివరికి చేసేదేమీ లేక అధికారిని బ్రతిమిలాడాడు.
Advertisement
Advertisement
also read;ఫ్యాన్స్ ని పెళ్లాడిన సినిమా సెలబ్రిటీస్..!!
also read:Mar 11th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!
అయినా అధికారి వినకపోవడంతో తన వ్యవసాయ పనులు చేసే ఎద్దును మున్సిపల్ ఆఫీస్ కు తీసుకువచ్చి డబ్బుకు బదులు ఎద్దును తీసుకెళ్లాలని అధికారులను కోరారు. ఎద్దు మున్సిపల్ ఆఫీస్ లోపలికి పట్టుకు రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇది కాస్త సోషల్ మీడియా ద్వారా వైరల్ అవ్వడంతో పై అధికారులకు తెలిసింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు రైతు ఎల్లప్పకు సంబంధించిన రికార్డులో మార్పు చేస్తామని హామీ ఇచ్చి, లంచం అడిగిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
also read;Sr:NTRకు ‘బ్రదర్’ అనే మాట నేర్పింది ఎవరో తెలుసా..?