Home » Sr:NTRకు ‘బ్రదర్’ అనే మాట నేర్పింది ఎవరో తెలుసా..?

Sr:NTRకు ‘బ్రదర్’ అనే మాట నేర్పింది ఎవరో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ స్టేజిలో ఉందంటే దానికి కారణం సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఆయన ఇండస్ట్రీలోనే ఒక లెజెండరీ హీరోగా పేరుపొంది, రాజకీయాల్లో కూడా రాణించి పేదల దేవుడిగా మారారు. అలాంటి ఎన్టీఆర్ కు ఒక ఊత పదం ఉండేది. ప్రతి ఒక్కరిని ఆయన బ్రదర్ అంటూ సంబోధించేవారు. మరి ఆయనకు బ్రదర్ అనే పదాన్ని నేర్పింది ఎవరు.. అనే విశేషాలు చూద్దాం..

also read:Mar 11th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Advertisement

తెలుగు ఇండస్ట్రీలో బ్రదర్ అనగానే స్వర్గీయ నందమూరి తారకరామారావు గారే గుర్తుకొస్తారు. మరలాంటి ఈ పదాన్ని ఎన్టీఆర్ కూడా అలవాటు చేసుకునేలా చేసింది తెలుగులో ప్రఖ్యాత దర్శకుడైన బి ఎన్ రెడ్డి. ఈ దర్శకుడు తన కన్నా పెద్దవారైనా దర్శకుడు గూడవల్లి రాంబ్రహ్మమును బ్రదర్ అంటూ సంబోధించేవారు. ఆ విధంగా రామబ్రహ్మం కూడా ఆ విధంగానే స్పందించేవారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తమ గురువులైన బి.యన్.రెడ్డి, రాంబ్రహ్మంలను చాలా గౌరవించేవారు.

Advertisement

also read:“ఆదిత్య 369” టైటిల్ లో 369 నంబ‌ర్ ఎందుకు పెట్టారో తెలుసా..? ఆ నంబ‌ర్ అర్థం ఏంటంటే..?

ఇక ఎన్టీఆర్ బి.యన్.రెడ్డి దర్శకత్వంలో తన మొదటి సినిమా మల్లీశ్వరిలో నటించారు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. మల్లీశ్వరి సినిమా షూటింగ్ సమయంలో బి.ఎన్.రెడ్డి తన తోటి వారిని ఎక్కువగా బ్రదర్ అంటూ పిలుస్తూ ఉండేవారు. ఈ మాట ఎన్టీఆర్ మనసుకు ఎంతగానో నచ్చింది. ఇక అప్పటినుంచి ఎన్టీఆర్ కూడా తనకంటే పెద్దవారైనా వారిని గౌరవించడం, తన పక్కన ఉన్న వారిని బ్రదర్ అని పిలవడం ప్రారంభించారు. దీంతో ఈ మాట తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయింది.

also read:Rana Naidu : ‘రానా నాయుడు’ తెలుగు రివ్యూ… దుమ్ము లేపిన రానా, వెంకీ

Visitors Are Also Reading