చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే చాయ్ తాగే అలవాటు ఉంటుంది. చాయ్ తాగనిది వారికి రోజు గడిచినట్టే ఉండదు. ముఖ్యంగా కొంత మంది అయితే చాయ్ తాగకుంటే తలనొప్పి వస్తుందని కూడా అంటుంటారు. ఒత్తిడిలో ఉన్నా లేదా చేసే పనికి బ్రేకు ఇచ్చి టీ తాగుతుంటారు. ఓ వ్యక్తి టీ తాగడానికి ఏకంగా ఓ కొత్త మార్గాన్నే ఎంచుకున్నాడు. ఆ మార్గం ఏమిటంటే.. మార్గమధ్యలో క్రాసింగ్ వద్ద ట్రైన్ ను నిలిపివేసి టీ తీసుకున్నాడు. దీంతో రైలులో ఉన్నటువంటి ప్రయాణికులతో పాటు రోడ్డుపై ఉన్న వాహనదారులు కూడా ఇబ్బందులను ఎదుర్కున్నారు. ఈ ఘటన బీహార్‌లోని సివాన్‌లో చోటు చేసుకుంది.
ఝాన్సి నుంచి గ్వాలియర్‌కు వెళ్లుతున్న మెయిల్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ టీ తాగడం కోసం సివాన్ ధాలా దగ్గర రైలును నిలిపివేశాడు. ముఖ్యంగా క్రాసింగ్ వద్దకు తీసుకువెళ్లి మరీ డ్రైవర్ ట్రైన్ ఆపాడు. గార్డు ఛాయ్ తీసుకొచ్చి డ్రైవర్‌కు ఇచ్చిన తరువాత ట్రైన్ బయలు దేరినది. సమీపంలో ఉన్నటువంటి దుకాణం నుంచి టీ తీసుకొచ్చిన తరువాత ట్రైన్ ముందుకు కదిలింది. ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ విధంగా ట్రైన్‌ను ఆపడం వల్ల బండిలోని ప్రయాణికులే కాదు.. సివాన్ ధాలా వద్ద కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఇరు వైపులా వాహనాలన్ని నిలిచిపోయాయి. ఈ ట్రాఫిక్ జామ్‌లో ఓ అంబులెన్స్ కూడా ఆగిపోయింది. ఈ విషయంపై ఆ స్టేషన్ సూపరింటెండెంట్ అనంత్‌కుమార్ స్పందించారు.
Advertisement
Advertisement
ఆ ఘటనకు సంబంధించిన ఫోటో తన దృష్టికి వచ్చిందని వెల్లడించారు. విచారణ చేపడుతామని రైల్వే అధికారులు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం రాజస్థాన్‌లో ఇలాంటి ఓ ఘటనే చోటు చేసుకుంది. అల్వార్‌లో ఓ డ్రైవర్ కచోడీ కోసం లోకో ఫైలెట్ ట్రైన్ ఆపేసాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారతదేశంలో ఈ విధంగా ఉంటే.. జపాన్ లాంటి దేశంలో ట్రైన్ ఒక నిమిషం ఆలస్యమైనా జీతాల్లో కోత విధిస్తారు. ఒక్క నిమిషం ముందు బయలు దేరినా.. ఆలస్యమైనా అక్కడి ప్రయాణికులకు స్వయంగా క్షమాపణలు చెప్పడం విశేషం.
Also Read :
సబ్జాగింజలు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి లేదంటే ప్రమాదమే..!!
సుడిగాలి సుధీర్ కి వచ్చిన కష్టమేంటి.. అంత ఎమోషనల్ అవుతున్నారు ఎందుకు..!!