పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్నది. ముఖ్యంగా తనను తానే గాడిదతో పోల్చుకోవడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. వాస్తవానికి ఆ వీడియోలో ఇమ్రాన్ ఖాన్ తాను బ్రిటన్‌లో గడిపిన రోజుల గురించి మాట్లాడుతున్నారు. బ్రిటన్‌లో నివసించినప్పటికీ ఆ సమాజంలో కలువలేకపోయానని చెప్పారు. ఇటీవల ఓ పాకిస్తానీ పాడ్‌కాస్ట్ కార్యక్రమానికి ఇమ్రాన్‌ఖాన్ అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
బ్రిటన్‌లో నాకు చాలా మంచి స్వాగతం లభించిందని.. బ్రిటీష్ సొసైటీలో కొంత మందికి మాత్రమే ఇలాంటి అవకాశం లభిస్తుంది. నేను దానిని ఎప్పుడూ నా ఇళ్లులా భావించలేఉ. ఎందుకంటే నేను పాకిస్తానీయుడిని.. నేను ఏం చేసినా బ్రిటిష్ వ్యక్తిని కాలేను అని.. మీరు గాడిదు చారలు గీస్తే.. అది కంచర గాడిద కాలేదు.. గాడిద ఎప్పుడూ గాడిద లాగే ఉంటుందని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఇమ్రాన్ పేర్కొన్న ఈ వ్యాఖ్యలను పాకిస్తానీయులు ఇంటర్నెట్‌లో విపరీతంగా పంచుకుంటున్నారు. భారత్‌లో కూడా ఈ వీడియో ఎక్కువగా షేర్ అవుతోంది.
Advertisement
Donkeys pretending to be zebras can never become zebras: Imran Khan pic.twitter.com/5RCAomksOG
— Murtaza Ali Shah (@MurtazaViews) May 7, 2022
పాకిస్తానీ జర్నలిస్టు హసన్ జైదీ ఈ వీడియోను షేర్ చేస్తూ.. వితౌట్ కామెంట్ అనే వ్యాఖ్యను జోడించారు. జియో న్యూస్ ఉర్దూ జర్నలిస్టు అబ్దుల్ ఖయ్యూమ్ సిద్ధిఖీ ఈ వీడియోకు చారలు గీయడం వల్ల గాడిద, జీబ్రా కాదు. అదెప్పుడూ గాడిదగానే మిగిలిపోతుంది. మాజీ ప్రధాని అని వ్యాఖ్యను జోడించారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే పాకిస్తానీ జర్నలిస్టు నలియా ఇనాయత్ కూడా గాడిద, గాడిదగానే ఉంటుందని మాటలను ఉటంకించారు. ఈ పాడ్ కాస్ట్ షో అంతా చూసిన తరువాత ఇమ్రాన్ ఖాన్ వాస్తవానికి విదేశాల్లో స్థిరపడిన పాకిస్తానీల గురించి.. పాకిస్తాన్ టాలెంట్ ఏవిధంగా విదేశాలకు వెళ్లిపోయిందో అనే అంశం గురించి మాట్లాడినట్టు స్పష్టమవుతోంది. విదేశాల్లో పాకిస్తానీలు ఎంత విజయవంతం అయినప్పటికీ స్వదేశంలో లభించినట్టుగా అక్కడ వారికి ఆ స్థాయి గౌరవం, స్థానం లభించకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసారు ఇమ్రాన్ ఖాన్.
Also Read :
పెళ్లిలో వధువు కునుకు.. వీడియో వైరల్..!
శ్రీకృష్ణుడు తలపై నెమలి ఫించం ధరించడానికి కారణం ఏంటో తెలుసా..?