Home » ఈ చిత్రంలో ఉన్న బాల‌న‌టుడు.. ఇప్పుడు ప్ర‌ముఖ స్టార్ హీరో.. ఎవ‌రో గుర్తు ప‌ట్టండి!

ఈ చిత్రంలో ఉన్న బాల‌న‌టుడు.. ఇప్పుడు ప్ర‌ముఖ స్టార్ హీరో.. ఎవ‌రో గుర్తు ప‌ట్టండి!

by Anji
Published: Last Updated on
Ad

ఒక‌ప్పుడు బాల‌న‌టులుగా వెండి తెర‌కు ప‌రిచ‌యం అయిన కొద్ది మంది ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ స్టార్‌లు ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. బాల‌కృష్ణ నుంచి మ‌హేష్ బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌ర‌కు ఒక‌ప్పుడు బాల న‌టులుగా మెప్పించిన వారే. బాల న‌టులుగా ప‌రిచ‌యం అయిన త‌రుణ్‌, మంచు మ‌నోజ్‌, బాలాదిత్య వంటి న‌టుల‌కు మాత్రం కాలం క‌లిసి రాలేద‌నే చెప్పాలి. కేవ‌లం కొన్ని చిత్రాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.

Advertisement

ప్ర‌స్తుతం మీరు చూసిన ఈ చిత్రంలో ఉన్న ప్ర‌ముఖ హీరోను చాలా సినిమాల్లో చూసే ఉంటారు. ఆయ‌న బాల‌న‌టుడిగా చేసిన చిత్రాలు చాలా త‌క్కువ‌నే ఉన్నాయి. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌టించిన ఒక్క సినిమాలోనే బాల‌న‌టుడిగా క‌నిపించారు. ఆ త‌రువాత ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో కుటుంబ క‌థా చిత్రాల హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇంత‌కు మ‌రీ ఎవ్వ‌రో గుర్తు ప‌ట్టారా..?

Advertisement

Also Read :  హ‌లో బ్ర‌ద‌ర్ సినిమా ఎంత వ‌సూలు చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఈ ఫోటోలో ఉన్న‌ది ఎవ‌రో కాదండోయ్‌.. వెంక‌టేష్‌. విక్ట‌రీ వెంక‌టేష్. 1971లో విడుద‌లైన ప్రేమ్ న‌గ‌ర్‌లో సినిమాలో వెంక‌టేష్ బాల‌న‌టుడిగా క‌నిపించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, వాణి శ్రీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. విల‌న్‌గా చిన్న నాటి పాత్ర‌లో వెంక‌టేష్ క‌నిపిస్తారు. డిసెంబ‌ర్ 13న ప్ర‌కాశం జిల్లా కారంచెడులో జ‌న్మించారు. 1986లో క‌ళియుగ‌పాండ‌వులు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు వెంక‌టేష్‌. ఇక అప్ప‌టి నుంచి వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్తున్నారు వెంక‌టేష్‌.

Also Read :  ఒకప్పటి స్టార్ విలన్ ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్నాడా..? చివరికి డబ్బుల్లేక..!

 

Visitors Are Also Reading