ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాల్లందరితో ఒకేసారి చాట్ చేయాలనుకున్నాడు. వారందరికీ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాడు. అందుకోసం ఓ వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశాడు. ఆ వాట్సాప్ గ్రూపునకు మెర్రీ ఎక్స్ మస్ అని పేరు పెట్టారు. వారందరూ అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ కావడంతో అలా పెట్టాడు. గ్రూపు క్రియేట్ చేసిన వెంటనే షాకు అయిన అతని మాజీ ప్రియురాళ్లు ఏమి చాట్ చేశారో వాటిని బయటపెట్టాడు. అతని పేరు టామ్ ఉండేది బ్రిటన్‌లో. అతని చాటింగ్‌కు సంబంధించిన ఎస్ఎంఎస్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
టామ్ ఇప్పటివరకు నలుగురు అమ్మాయిలతో ప్రేమలో పడి, కొన్ని నెలలకే బ్రేకప్ చెప్పాడు. ఈసారి క్రిస్మస్ కు మాత్రం అతను ఒంటరిగా ఉన్నాడు. మరొకసారి ప్రేమలో పడలేదు. తన మాజీ ప్రియురాళ్లందరితో ఒకేసారి టామ్‌కు మాట్లాడాలనిపించింది. వెంటనే మెర్రి ఎక్స్ మస్ పేరుతో గ్రూపు క్రియేట్ ఏశాడు. గెమ్మా, లిసా, బెల్లా, స్టెఫానీ, ఈ నలుగురు అతని మాజీ ప్రియురాళ్లు.. వారి నెంబర్లను యాడ్ చేశాడు. తానే మొదటి మెసెజ్ పెట్టాడు. మెర్రీ క్రిస్మస్ గర్ల్స్ నేను ఈ క్రిస్మస్ వేడుకకు ఒంటరిగా ఉన్నాను. మీరు నాతో కలిసి ఉన్నప్పటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకుంటారని ఆశిస్తున్నాను. మిమ్మల్ని నేను చాలా మిస్ అయ్యాను అని మెసేజ్ పెట్టాడు. దానికి మొదటి ప్రియురాలు గెమ్మా స్పందించి టామ్ నువ్వు బాగా తాగినట్టున్నావ్ అంటూ రిప్లయ్ ఇచ్చింది.
Advertisement
Advertisement
లిసా అనే మాజీ ప్రియురాలు మాత్రం వెంటనే గ్రూపులోంచి లెప్ట్ అయింది. ఇక బెల్లా మాత్రం చాలా సీరియస్ అయింది. ఇక బెల్లా మాత్రం చాలా సీరియస్ అయింది. నాతో ప్రేమలో ఉన్నప్పుడే నువ్వు మరొక అమ్మాయితో గడిపావు అని మెసేజ్ పెట్టింది. దానికి స్టెఫానీ అనే మరొక మాజీ ప్రేమికురాలు నాకు నీతో బ్రేకప్ అయిందని చెప్పాడు అని రిప్లయ్ ఇచ్చింది. బెల్లా, స్టెఫానీ కాసేపు వాదంచుకున్నాక గ్రూపులోంచి వెళ్లాపోయారు. ఇక మిగిలింది గెమ్మా, టామ్ మాత్రమే. వీరు హై స్కూల్ చదివే సమయంలో ప్రేమలో పడ్డారు. గ్రూపులో వీరిద్దరే చాటింగ్ చేసుకోవడం కొనసాగించారు. మళ్లీ వీరి ప్రేమ చిగురిస్తుందా..? లేక ఈమె కూడా స్వస్తీ చెప్పనుందా చూడాలి.
Also Read : అణ్వస్త్రాలను రష్యా మోహరించిందా..? పుతిన్ ప్రకటన ఆ దేశాలకోసమేనా..?