పెళ్లి అంటే నూరేళ్ల పంట అని అంటుంటారు. తమ పిల్లల పెళ్లి జరిపించడం కోసం తల్లిదండ్రులు నానా కష్టాలు పడుతుంటారు. కానీ కొంత మంది ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తుంటారు. కొంత మంది అబ్బాయిలు పెళ్లి జరిగిన తరువాత మరొక అమ్మాయితో లేచిపోవడం, కొంత మంది అమ్మాయిలు మరొక అబ్బాయితో.. కొంత ఇష్టం లేని పెళ్లి చేసారని సూ సైడ్ చేసుకోవడం లాంటివి చేస్తుండడం మనం తరుచూ చూస్తేనే ఉన్నాం. ఇలాంటి తరుణంలోనే ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. అది ఏమిటంటే.. పెళ్లి జరిగిన కొద్ది సేపటికే పెళ్లి కొడుకుకు అసలు ఊహించని షాక్ తగిలింది. తనకు నచ్చిన అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభమయిందనే సంతోషం క్షణాల్లోనే మాయం అయిపోయింది. తాను ప్రేమించి పెళ్లాడింది అమ్మాయిని కాదు అని తెలుసుకు ఆశ్చర్యపోయాడు. ఈ విచిత్రమైన ఘటన ఒడిశాలోని భద్రక్ జిల్లాలో జరిగింది.
Advertisement
పశ్చిమబెంగాల్లోని నార్త్ 24 పరగణాలు జిల్లాకు చెందిన అలోక్ కుమార్ మిస్త్రీ, కేంద్ర పాడ జిల్లాలలోఒని రామనగర్ గ్రామానికి చెందిన బిశ్వనాథ్ కుమార్తె మేఘన మండల్ తో గత కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. మే 24 జాజ్పుర్లోని ఛండీఖోల్లో కలుసుకున్నారు. అలోక్‌కుమార్, మేఘనను బసుదేవ్పూర్లోని కాసియాలో ఉన్న తన మేనమామ ఇంటికి తీసుకెళ్లి పరిచయం కూడా చేసారు.
Advertisement
ఇక వీరిద్దరి ప్రేమ గురించి తెలుసుకున్న అలోక్‌కుమార్ కుటుంబ సభ్యులు వారి పెళ్లికి ఒప్పుకున్నారు. అనుకున్న విధంగానే వారిద్దరికీ అంగరంగవైభవంగా వివాహం జరిపించారు. వివాహం జరిగిన తరువాత రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసారు. ఆ రిసెప్షన్లో అసలు బండారం బయటపడింది. రిసెప్షన్ కు వచ్చిన స్థానిక వ్యక్తి వధువును మేఘన అని కాకుండా మేఘనాథ్ అని పిలిచాడు. దీంతో పెళ్లి కొడుకు అలోక్, అతని కుటుంబమంతా ఆశ్చర్యపోయారు. అతని పేరు మేఘనాథ్ అని.. దూరపు బంధువు అని.. ఆ అతిథి చెప్పాడు. దీంతో పెళ్లి కూతురు అమ్మాయి కాదు.. అబ్బాయి అని తెలుసుకుని వరుడు, అతని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కంగుతిన్నారు. దీంతో గ్రామస్తులు మేఘనాథ్‌ను చితకబాదారు. అంతేకాదు.. బట్టలు కూడా చింపేసారు. అతని జుట్టును కూడా కత్తిరించారు. ఈ విషయం పై వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు. కోటి ఆశలతో పెళ్లి చేసుకుని ఓ యువకుడి ఆశలన్నీ అర నిమిషంలోనే తారుమారు అయిపోయాయి. పాపం పెళ్లి కొడుకుకు ఊహించని పరిస్థితి ఎదురైందనే చెప్పాలి.
Also Read :
కేంద్రప్రభుత్వం హెచ్చరిక.. ఇక నుంచి ఆ జిరాక్స్ కాపీలను ఎవరికీ ఇవ్వకండి..!
పెళ్లి తరువాత ఊరేగింపులో ఊరమాస్ డ్యాన్స్‌తో నూతన జంట.. అందరూ ఫిదా