రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఓ మహిళా ఫైలట్ చూపించిన ధైర్య సాహసాల పట్ల సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. గుజరాత్ కచ్‌లోని తుంబ్డి ప్రాంతానికి చెందిన దిశా గదా.. ఎయిర్ ఇండియాలో ఫైలట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులను స్వదేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు ఆమె ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. యుద్ధం జరుగుతున్నా విద్యార్థుల భద్రతే ముఖ్యం అని భావించి.. ఆ దేశానికి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. మరొక నలుగురు సీనియర్ సిబ్బందితో కలిసి ఎయిర్ ఇండియా విమానంలో ఉక్రెయిన్‌కు బయలు దేరారు.
Also Read : వరుణ్ తేజ్ ‘గని’ విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే..?
Advertisement
Advertisement
నల్ల సముద్రం మీదుగా కీవ్ లోని బోరిస్‌పిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడ సహాయం కోసం ఎదురు చూస్తున్న 242 మంది వైద్య విద్యార్థులను ఎక్కించుకుని ముంబయికి తీసుకొచ్చారు. ఎయిర్ ఇండియా విమానాన్ని ఉక్రెయిన్లో ల్యాండ్ చేసే సమయంలోనే యుద్ధం ప్రారంభం అయిందని ఫైలట్ దిశ పేర్కొన్నారు. యుద్ధ సన్నివేశాలు సవాల్ విసిరినప్పటికీ సీనియర్ల మార్గదర్శకత్వంలో విమానాన్ని ఉక్రెయిన్‌లో భద్రంగా ల్యాండ్ చేయగలిగామని ఆమె వెల్లడించారు. ఫలితంగా విద్యార్థులను ఇక్కడికి తీసుకురాగలిగామని తెలిపారు. తాము చేసిన సాయం కష్టతరమైనప్పటికీ మన దేశ విద్యార్థుల భద్రత దృష్ట్యా నిర్ణయం తీసుకోలేక తప్పదు అని ఫైలట్ దిశ హర్షం వ్యక్తం చేశారు. పైలట్ దిశ తన భర్త ఆదిత్య మన్నూర్‌తో కలిసి ముంబయిలో నివాసముంటున్నారు. దిశా కచ్ వాసి కావడంతో కచ్ వాసులు గర్వంతో ఉప్పొంగుతున్నారు.
ఉక్రెయిన్‌లో సుమారు 16వేల మంది భారతీయ పౌరులు చిక్కుకున్నారు. వారి భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. భారతీయుల సురక్షిత ప్రయాణం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత తీవ్రం అవుతున్నాయని అనుమానిస్తూ భారత ప్రభుత్వం ఫిబ్రవరి 15న ఉక్రెయిన్‌ను ఖాలీ చేయమని భారతీయులకు సలహా ఇచ్చింది. దాదాపు 2వేల మంది భారతీయులు సలహాను అనుసరించి భారతదేశానికి తిరిగి వచ్చారు. భారతీయ రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ కాంటాక్ట్ నెంబర్‌లు, మెయిల్ ఐడీలు ఏర్పాటు చేసింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తరలించడానికి మోడీ ప్రభుత్వం ఆపరేషన్ గంగ ప్రాజెక్ట్‌ను చేపట్టింది.