Home » ఈ ఫోటోలో ఉన్న పసి బాలుడు.. తెలంగాణలో పెద్ద లీడర్.. ఎవరో కనుక్కోండి..

ఈ ఫోటోలో ఉన్న పసి బాలుడు.. తెలంగాణలో పెద్ద లీడర్.. ఎవరో కనుక్కోండి..

by Sravanthi
Ad

తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.. పరిపాలన విషయంలో కార్యదక్షత, ప్రజా సమస్యలను పరిష్కారం చేయడంలో ఉన్నటువంటి పట్టుదల కృషి, ఒక క్లాస్ లీడర్ గా రాష్ట్ర ప్రజల తలలో నాలుకలా ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే లీడర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. లక్షలాది మంది అభిమానులు సంపాదించుకొని తెరాస ప్రభుత్వంలో తిరుగులేని నేతగా ఉన్నటువంటి ఈ లీడర్ చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Advertisement

 

దీంతో నెటిజన్స్ ఈ లీడర్ ఎవరబ్బా అంటూ ఆయనను గుర్తు పట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇంతకీ ఆ లీడర్ ఎవరో మనం కూడా ఓ సారి చూద్దాం.. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ,రాష్ట్ర ఐటి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్న నాయకుడు కేటీఆర్.. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఎంతోమంది అభిమానులు, ప్రజలు పార్టీ క్యాడర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఎక్కడపడితే అక్కడ కేక్ కట్ చేసుకుంటూ వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియాలో మాత్రం అతని ఫాలోవర్స్ కల్వకుంట్ల తారక రామారావుకు చాలా వెరైటీ గా విషెస్ చెప్పాలనుకున్నారు. గౌతమ్ అనే కేటీఆర్ ఫ్యాన్ మంత్రి గారి చిన్నప్పటి ఫోటో ట్విటర్లో షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అబ్బా అంటూ చాలామంది వెతక సాగారు.. మరి ఆ ఫోటోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

ALSO READ:

Visitors Are Also Reading