Home » ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో ఇంగ్లాండ్‌పై విజ‌యం సాధించిన ఆసీస్

ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో ఇంగ్లాండ్‌పై విజ‌యం సాధించిన ఆసీస్

by Anji
Ad

ఐసీసీ మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో ఆసీస్ గెలిచింది. ఇంగ్లాండ్‌ను 71 ప‌రుగుల తేడాతో చిత్తుగా ఓడించి రికార్డు స్థాయిలో ఏడ‌వ‌సారి ట్రోఫీని ముద్దాడింది. మొత్తం 12 ప్ర‌పంచ క‌ప్ లో ఆసీస్ 7సార్లు గెల‌వ‌గా ఇంగ్లాండ్ 4, న్యూజిలాండ్ ఓసారి విజేత‌లుగా నిలిచాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌.. నిర్ణీత 5 ఓవర్ల‌లో 5 వికెట్ల‌కు 356 ప‌రుగులు చేసి ఇంగ్లాండ్ ముందు భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. సెమీ ఫైన‌ల్‌లో సెంచ‌రీ చేసిన ఓపెన‌ర్ అలీసా హేలీ.. ఈ మ్యాచ్‌లో మ‌రింత రెచ్చిపోయింది. కేవ‌లం 138 బంతుల్లోనే 170 ప‌రుగులు చేసి ఆఖ‌ర్లో వెనుదిరిగింది. ఇందులో ఏకంగా 26 ఫోర్లు ఉండ‌డం విశేషం. మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్ రోల్డ‌న్ శ‌త‌కం చేసింది. రాచెన్ హేన్స్ (68) బెత్ మూనీ (62) ప‌రుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో ష్ర‌బోల్ 3 వికెట్లు ప‌డ‌గొట్టింది.

Advertisement


అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఏ ద‌శ‌లోనూ గెలుపు దిశ‌గా సాగ‌లేదు. క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు కోల్పోయింది. స్కివ‌ర్ మాత్ర‌మే సెంచ‌రీతో రాణించింది. 148 ప‌రుగుల‌తో నాటౌట్‌తో నిలిచింది. ఆమెకు స‌హ‌కారం అందించే వారెవ్వ‌రూ లేక‌పోయారు. మ‌రెవ్వ‌రూ క‌నీసం 30 ప‌రుగులు కూడా చేయ‌లేక‌పోయారు. ఆసీస్ బౌల‌ర్లలో అలెనా కింగ్‌, జొనాస్సెన్ త‌లో 3 వికెట్లు తీయ‌గా.. మేగ‌న్‌స్క‌ట్ 2 వికెట్ల‌తో రాణించింది. ఓ ఐసీసీ వ‌రల్డ్ క‌ప్‌ఫైన‌ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేస‌న బ్యాట‌ర్‌గా ప్ర‌పంచ రికార్డు సృష్టించింది హేలీ. పురుషుల క్రికెట్‌లో ఈ రికార్డు సాధ్యం కాలేదు. ఆసీస్ విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ మాజీ ప్లేయ‌ర్ అండం గిల్‌క్రిస్ట్ 2007 ప‌రుషుల క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చేసిన 149 ప‌రుగులే ఇప్ప‌టివ‌ర‌కు అత్యుత్త‌మంగా ఉంది.

Advertisement

ఇప్పుడు చిర‌స్మ‌రీణీయ ఇన్నింగ్స్ ఆడిన హేలీ దానిని బ్రేక్ చేసింది. మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్‌క‌ప్ ఎడిష‌న‌ల్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో కూడా హేలీ అగ్ర‌స్థానంలో నిలిచింది. ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్‌లో 9 ఇన్నింగ్స్‌లో 56.56 స‌గ‌టుతో 509 ప‌రుగులు చేసింది. ఇందులో రెండు సెంచ‌రీలు ఉన్నాయి. దీంతో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్‌గా నిలిచింది.

Visitors Are Also Reading