రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా బిజ్నోర్ నుంచి మీరట్ వైపు వెళుతుండగా దారిలో అంబులెన్స్‌లో ఇంధనం అయిపోయింది. గ్రామానికి చెందిన స్థానికులు అంబులెన్స్‌లో సమీపంలోని పెట్రోల్ బంక్ వరకు వెళ్ళడానికి తాడుతో ట్రాక్టర్‌కు కట్టారు ఈ విషయం తెలియగానే జిల్లా అధికార యంత్రాంగంలో కలకలం రేగింది.
Advertisement
మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అఖిలేష్ మోహన్ ఈ సంఘటనపై మాట్లాడుతూ అంబులెన్స్ మీరట్ కు చెందినది కాదు. బిజ్నోర్ నుండి మీరట్ కు వస్తుండగా అంబులెన్స్ లో ఇంధనం అయిపోయింది అని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంబులెన్స్‌లో నిర్వహణ సరిగ్గా లేకపోతే ఎన్నో ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. చాలా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలకు పెద్ద మొత్తంలో నిధులు అందుతున్నాయి.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
Advertisement