Home » భద్ర చిత్రంలో హీరో రవితేజ ఫ్రెండ్ పాత్రను వదులుకున్న నటుడు ఎవరంటే..?

భద్ర చిత్రంలో హీరో రవితేజ ఫ్రెండ్ పాత్రను వదులుకున్న నటుడు ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala

సాధారణంగా ఏ ఇండస్ట్రీ చూసిన కొంతమంది హీరోలు చేయాల్సిన కొన్ని సినిమాలను మరో హీరో చేసి హిట్ కొట్టడం మనం చూస్తూనే ఉంటాం. ఆ సినిమా హిట్ అయిన తర్వాత అయ్యో ఆ సినిమా నేను చేస్తే బాగుండు అని బాధపడిన సందర్భాలు అనేకం ఉంటాయి. ఇలా హీరో, హీరోయిన్లకు మాత్రమే కాకుండా హీరో స్నేహితుల పాత్రలను కూడా కొంతమంది నటులు చేజార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. రవితేజ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ భద్ర చిత్రంలో ఇలాంటిదే జరిగింది.

also read:‘బలగం’తో నేనే హీరో అవుదాం అనుకున్నా.. కానీ ఆయన అడ్డుకున్నారంటూ ఎమోషనల్ అయిన వేణు..?

బోయపాటి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రవితేజ హీరోగా వచ్చిన భద్రా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలుసు. ఇక ఈ చిత్ర విజయం తర్వాత రవితేజ కెరియర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఇందులో రవితేజ క్యారెక్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో రవితేజ క్యారెక్టర్ తో పాటు హీరోయిన్ అన్నయ్యగా చేసిన ప్రకాష్ రాజ్ దీపక్ పాత్రకి కూడా మంచి గుర్తింపు లభించింది.

also read:Viral video:ఏం అమ్మాయి రా బాబు.. అడగగానే నెంబర్ ఇచ్చిన యువతి.. యువకుడు ఏం చేశాడంటే..!

 

అయితే ఈ పాత్రకు దీపక్ బాగా సెట్ అయ్యాడు అని అందరూ అనుకున్నారు. కానీ ముందుగా దర్శకుడు బోయపాటి, రవితేజ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం దీపక్ ను అనుకోలేదట, ఆ పాత్రలో రాజీవ్ కనకాల అయితే బాగుంటుందని భావించారట. కానీ అప్పటికే రాజీవ్ కనకాల చాలా సినిమాల్లో బిజీ బిజీగా ఉండడం, డేట్స్ కేటాయించలేకపోయాడట. దీంతో బోయపాటి ఆప్షన్ లేక హీరో శివాజీని అడిగారట ఆయన కూడా డేట్స్ కుదరకపోవడంతో దీపక్ కు ఆ ఛాన్స్ వచ్చింది.

also read:vande bharat train ticket:వందే భారత్ ట్రైన్ తక్కువ ధరకే ఎక్కోచ్చు..ఎలాగంటే..?

Visitors Are Also Reading