గత కొద్దిరోజులుగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేకపోవడంతో అతనికి ఊహించని షాక్ తగిలింది. ఇవాళ జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ దూరమయ్యారు. కోహ్లీకి గజ్జల్లో గాయం కారణంగా కిన్నింగ్టన్ ఓవల్‌లో జరిగే మ్యాచ్‌లో ఆడడం లేదని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ జరిగింది. రెండవ మ్యాచ్ జులై 14న, మూడవ మ్యాచ్ జులై 17న జరుగనున్నాయి. అయితే చివరి రెండు మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో ఉండనున్నట్టు సమాచారం. మరొకవైపు ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీ పరుగులు సాధించడానికి ఎంతో శ్రమిస్తున్నాడు. టీ-20 సిరీస్‌లో కూడా తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో అభిమానులు కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కోహ్లీ జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయనే చెప్పవచ్చు. మాజీ క్రికెటర్లు సైతం కోహ్లీని తప్పించాలనే డిమాండ్ తీసుకొస్తున్నారు.
Advertisement
Advertisement
ఇదిలా ఉండగా. టీమిండియా తరుపున రెగ్యులర్ కెప్టెన్ గా విదేశాల్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు ఇదే మొదటి వన్డే సిరీస్ కావడ విశేషం. మరొక వైపు టీ-20 సిరీస్‌లో బట్లర్ సేనను రోహిత్ సేన చిత్తు చిత్తుగా ఓడించింది. 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్నది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ నిలిచాడు. మరొక వైపు ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ వన్డే క్రికెట్‌లో 150 వికెట్ల మార్కును అందుకున్నాడు. షమీ మూడవ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
Also Read :
డివిలియర్స్ తర్వాత ఆ స్థానం సూర్య కుమార్ కే సొంతం…!
ఈ సమయంలో వచ్చే కలలు తప్పనిసరిగా నిజమవుతాయి.. ఎందుకంటే..?