Home » రవితేజ రావణాసుర ఓటీటీలోకి వచ్చేది అప్పుడే ?

రవితేజ రావణాసుర ఓటీటీలోకి వచ్చేది అప్పుడే ?

by Anji
Ad

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం రావణాసుర. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకున్న విషయం విధితమే.  వాస్తవానికి మే సెకండ్ వీక్ లో  రావణాసుర చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని తొలుత భావించారు. కానీ  ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని దక్కించుకోకపోవడంతో ముందుగానే ఓటీటీలో విడుదల చేయనున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.  

Also Read :  “ఈ సినిమాల్లో హీరోయిన్స్ కంటే కూడా సైడ్ క్యారెక్టర్స్ ఫేమస్ !

Advertisement

అంటే వారం రోజుల ముందుగానే మే మొదటి వారంలో రావణాసుర ఓటీటీలో విడుదల కాబోతుంది. ముఖ్యంగా మే 5న డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. రావణాసుర చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్టీటీమ్ వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా, రవితేజ నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చారు. శ్రీకాంత్ విస్సా అందించిన ఈ కథను సుదీర్ వర్మ స్క్రీన్ ప్లే రాశారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిచారు.

Advertisement

ఈ చిత్రం మొత్తం రవితేజ వన్ మ్యాన్ షో గా కనిపించింది. ఇందులో ఐదుగురు హీరోయిన్లు ఉన్నారని ప్రచారం జరగ్గా.. ఐదుగురు వేర్వేరు పాత్రల్లో కనిపించారు. రవితేజకు ప్రియురాలుగా నటించిన అను ఇమ్మానుయేలు పాట పెద్దగా ఆకట్టుకోలేదు.  ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, మెఘా ఆకాశ్  మంచి పాటలు దక్కాయి. కానీ పాత్రల నిడివి చాలా తక్కువగా ఉంది. మరోవైపు సుశాంత్, రావు రమేష్, మురళీ శర్మ,హైపర్ ఆది, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్  7న ఈ సినిమా విడుదల అయింది. కానీ ఆశించిన మేరకు ఆకట్టుకోలేకపోయింది. ఓటీటీ ఆకట్టుకుంటుందేమో వేచి చూడాలి మరి.   

Also Read :  శాకుంతలంలోని సానుమతి లుక్ లో వర్షిణి మామూలుగా లేదుగా..!

Visitors Are Also Reading