మన తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరో హీరోయిన్ల జీవితాలు మధ్యలోనే ముగిసాయి.. కొంతమంది అనారోగ్య కారణాల వల్ల చనిపోతే, కొంతమంది మధ్యలోనే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. యంగ్ హీరో ఉదయ్ కిరణ్, యంగ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్. ఇద్దరూ స్నేహితులే. వీరిద్దరూ ఒకే టైం లో వారి యొక్క కెరియర్ ను మొదలు పెట్టారు. ఇద్దరూ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి అయిదు ఆరు సంవత్సరాలు తిరుగులేని స్టార్డమ్ ను సంపాదించారు.. చిత్రం మూవీ తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ నువ్వు నేను,మనసంతా నువ్వే లాంటి సూపర్ హిట్ లతో అప్పటి హీరోలకే చెమటలు పట్టించారు అని చెప్పవచ్చు.
Advertisement
ఇక వెంకటేష్ సరసన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఆర్తి అగర్వాల్ కూడా అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అయిన నాగార్జున, వెంకటేష్,చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి అందరితో నటించింది. అప్పట్లో ఆర్తి అందంతో కుర్రకారుకు చెమటలు పట్టించేది.ఆమె నటన అందం ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలంలోనే ఉన్నత శిఖరాలకు ఎదిగిన వీరి మధ్య నిజజీవితంలో కూడా మంచి స్నేహం కుదిరింది.. ఇద్దరి మధ్య స్నేహ అనుబంధం నేపథ్యంలో ఒక సినిమా కూడా వచ్చింది. అదే నీ స్నేహం మూవీ. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పై ఎమ్మెస్ రాజు ఈ మూవీని నిర్మించారు.. ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించగా విశ్వనాథ్, గిరిబాబు, శివాజీ రాజా లాంటి నటులు కీలక పాత్రల్లో నటించారు.
Advertisement
ఈ సినిమా నుండే ఆర్తి అగర్వాల్ ఉదయ్ కిరణ్ మంచి స్నేహితులయ్యారు.. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తారు హిట్ గా నిలిచింది. ఈ మూవీ అయిపోయాక కూడా వీరిద్దరూ స్నేహితులుగానే ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ఇద్దరి సినిమా కెరియర్ లు ఒకేసారి డల్ అవుతూ వచ్చింది.. ఆర్తి అగర్వాల్ తరుణ్ తో బ్రేకప్ అవడం, ఉదయ్ కిరణ్ చిరంజీవి కూతురు సుస్మిత తో ఎంగేజ్ మెంట్ జరిగినా క్యాన్సల్ చేసుకోవడం వీరి సినిమా కెరియర్ లో దెబ్బ కారణం అన్నీ ఒకేసారి జరిగిపోయాయి.. దీంతో ఇద్దరు స్టార్ నటులు చిన్నవయసులోనే ఆకస్మికంగా మృతి చెందారు అని చెప్పవచ్చు.
ALSO READ;