నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం సమరసింహారెడ్డి గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. 1999లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ సాధించింది. ఇందులో వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసే శక్తిమంతమైన ఫ్యాక్షన్ నాయకుడిగా కనిపించాడు. ఈ సినిమాలో సిమ్రాన్, అంజలా ఝవేరి, పృథ్వీ ప్రధాన పాత్రదారులుగా నటించారు. సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఈ మూవీ హై-ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, ఆకట్టుకునే పాటలతో కూడిన మసాలా ఎంటర్‌టైనర్‌గా పరిగణించబడుతుంది. ఈ చిత్రంలో సగటు ప్రేక్షకుడు అర్థం చేసుకొని అసలైన అర్థం దాగి ఉంది.
Advertisement
ఒక సోదరుడు, తన సోదరీమణుల కోసం ఏదైనా చేస్తాడన్నది ఈ సినిమాలోని అసలు పాయింట్. ఇది మసాలా డ్రామా కంటే ఎమోషనల్ డ్రామా అని చెప్పుకోవచ్చు.రాయలసీమలో హింసాత్మకమైన ఫ్యాక్షనిజం నేపథ్యంలో కుటుంబం, విధేయత, గౌరవం, న్యాయం యొక్క ఇతి వృత్తాలను ఈ చిత్రం అన్వేషిస్తుంది. ఇక సినిమా కథలోకి వెళితే, చిన్నతనంలో తండ్రి హత్యను చూసి ఇంటి నుంచి పారిపోయిన వాసు (పృథ్వీ) ఫ్లాష్‌బ్యాక్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. తనను సోదరుడిలా చూసుకునే సమరసింహారెడ్డికి నమ్మకమైన అనుచరుడిగా వాసు ఎదుగుతాడు. వాసుకి చెల్లెలు ఉంటారు. తన చెల్లెల్ల భవిష్యత్ ను, చదువును తాను చూసుకుంటానని సమరసింహారెడ్డి వాసుకి హామీ ఇస్తాడు. అంతలోనే జయప్రకాశ్ రెడ్డి వర్గం అకస్మిక దాడిలో వాసు చనిపోతాడు. ఈ ఘర్షణలో సమరసింహారెడ్డి కూడా తీవ్రంగా గాయపడి అజ్ఞాతంలోకి వెళ్తాడు.
Advertisement
ఆయన కోలుకున్నాక వాసుకు ఇచ్చిన హామీ నెరవేర్చడం కోసం వాళ్ల చెల్లెల్లు ఉన్న వద్దకు వెళ్తాడు. అతడి చెల్లెళ్లకు తన గుర్తింపును వెల్లడించకుండా ఆమె బస చేసిన హోటల్‌లో వెయిటర్‌గా వేషం వేసి ఆమె ఖర్చులకు రహస్యంగా డబ్బు చెల్లిస్తాడు.ఇంతలో, వీర్రాజు, అతని మనుషులు సమరసింహారెడ్డిని అంతం చేయడానికి వెతుకుతుంటారు.సమరసింహా రెడ్డి వాసు చెల్లెళ్లను శత్రువుల నుంచి రక్షించవలసి వస్తుంది, అదే సమయంలో తన నిజమైన గుర్తింపును ఆమె వద్ద దాచాల్సి వస్తుంది.
సమరసింహా రెడ్డి గురించి, వాసుతో అతని సంబంధం గురించి చెల్లెల్లు తెలుసుకునేటప్పటికీ సినిమా క్లైమాక్స్ కి చేరుకుంటుంది. అతని త్యాగం, ఆప్యాయతకు వారు చాలా ఎమోషనల్ అవుతారు. ఒకానొక సమయంలో ఆ చెల్లెళ్ల కోసం బాలకృష్ణ విషం కూడా తాగుతాడు. బాలయ్య, జయప్రకాశ్ రెడ్డి మధ్య జరిగిన ఘర్షణతో చివరగా సినిమా ముగుస్తుంది. దీంతో రాయలసీమ ప్రాంతంలో శాంతిని నెలకొల్పుతాడు. ఈ సినిమా కేవలం ఫ్యాక్షన్ సినిమా మాత్రమే కాదు.. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ సినిమా. ఈ చిత్రంలో దాగి ఉన్న అద్భుతమైన పాయింట్ కూడా ఇదే.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.