Home » మధ్యలోనే ఆగిపోయిన ఉదయకిరణ్ సినిమాలు ఇవే ..! ఇవే విడుదల అయ్యుంటే అయన ఇమేజ్ ఇంకోలా

మధ్యలోనే ఆగిపోయిన ఉదయకిరణ్ సినిమాలు ఇవే ..! ఇవే విడుదల అయ్యుంటే అయన ఇమేజ్ ఇంకోలా

by Anji
Ad

త‌న‌కు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హీరో ఉద‌య్ కిర‌ణ్‌. కేవ‌లం మొద‌టి మూడు సినిమాల‌కే స్టార్ హీరోగా మారాడు. అత‌ను తొలుత‌గా చిత్రం సూప‌ర్ హిట్ సాధించింది. రెండ‌వ సినిమా నువ్వు నేను బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఇక మూడ‌వ సినిమా మ‌నసంతా నువ్వే డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో క్రేజీ పెరిగింది.

udaykiran-movies-not-released

Advertisement

మ‌న‌సంతా నువ్వే త‌రువాత ఉద‌య్ కిర‌ణ్ క‌లుసుకోవాల‌ని, శ్రీ‌రామ్ వంటి సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ బాగానే వ‌సూలు చేశాయి. కానీ ఆ త‌రువా నుంచి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. నీ స్నేహం నీకు నేను నాకు న‌వ్వు ఔన‌న్నా కాద‌న్నా సినిమాలు త‌ప్ప అన్నీ ప్లాప్ అయ్యాయి. ఇత‌ను సంపాదించుకున్న ఫాలోయింగ్ కూడా పూర్తిగా దూర‌మైపోయింది.

Nuvvu Nenu (నువ్వు నేను) | Watch 2001 Nuvvu Nenu Full Movie Online - MX Player

త‌రువాత అత‌ను చేసిన సినిమాల‌ను ప్రేక్ష‌కులు అస్స‌లు ప‌ట్టించుకోలేదు. 2014లో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఆత్మ‌హ‌త్య చేసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. మాన‌సికంగా క్రుంగిపోవ‌డం వ‌ల్ల‌నే ఇత‌ను అఘాయిత్యం చేసుకున్నాడు అని ప్ర‌చారం జ‌రిగింది. అయితే దీని వెనుక అస‌లు క‌థ ఏమిటి అనేది ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రికీ తెలియ‌దు. ఉద‌య్ చేయాల్సిన సినిమాల‌న్నీ షూటింగ్ ద‌శ‌లోనే ఆగిపోయాయి. ఆ సినిమాలు చేసి ఉంటే క‌చ్చితంగా మంచి హిట్‌లు అందుకునే వాడేమోన‌ని కొంద‌రు చెప్పుకుంటున్నారు. షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయిన ఉద‌య్‌కిర‌ణ్ సినిమాలు ఏమిటో చూద్దాం.

Manasantha Nuvve: 19 ఏళ్లు పూర్తి చేసుకున్న మనసంతా నువ్వే.. ఎంఎస్ రాజు ఎమోషనల్ ట్వీట్..

స్టార్ నిర్మాత ఏ.ఎం. ర‌త్నం సూర్య మూవీస్ బ్యాన‌ర్ పై ఉద‌య్ కిర‌ణ్‌తో ప్రేమంటే సులువు కాదురా అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. దాదాపు 40 శాతం షూటింగ్ కూడా పూర్త‌యింది. కానీ ఎందుకో ఏమో ఈ సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ప్ర‌త్యూష క్రియేష‌న్ బ్యాన‌ర్ పై ఉద‌య్ కిర‌ణ్-అంకిత‌ల‌తో ఓ ప్రాజెక్ట్ కూడా ప్రారంభించారు. త‌రువాత ఈ ప్రాజెక్ట్ ర‌ద్ద‌యింది. అంజనా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్‌కిర‌ణ్‌-ఆశిన్ జంట‌గా ఓ చిత్రం ప్లాన్ చేశారు. ఇది కూడా ఆగిపోయింది.

Advertisement

TeluguCinemaHistory on Twitter: "#MaheshBabu I #UdayKiran I #Trisha Launching 'Boys , 2003' audio cassettes https://t.co/u0fAVuOAYI" / Twitter

బాల‌కృష్ణ‌-సౌంద‌ర్య ప్ర‌ధాన పాత్ర‌లో న‌ర్త‌న‌శాల అనే సినిమాను ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో ఉద‌య్ కిర‌ణ్‌ను అభిమాన్యుడి పాత్ర‌కు ఎంపిక చేసుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నేలేదు. ఉద‌య్‌తో పాటు సౌంద‌ర్య కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. త్రిష‌-ఉద‌య్‌కిర‌ణ్ కాంబోలో జ‌బ్‌వీమెట్ తెలుగులో రీమేక్ చేయాల‌నుకున్నారు. కానీ కుద‌ర‌లేదు. సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ వారు ల‌వ‌ర్స్ సినిమాను ఉద‌య్‌కిర‌ణ్, స‌దాతో రూపొందించాల‌ని ప్లాన్ చేశారు. ఆ ప్రాజెక్ట్ కూడా ర‌ద్ద‌యిన‌ది.

Uday Kiran Birth Anniversary: ఉదయ్ కిరణ్ ఈ 10 సినిమాలు చేసుంటే ఈ రోజు సూపర్ స్టార్ అయ్యుండేవాడేమో..?
ఆదిశంక‌రాచార్య సినిమా కూడా ఉద‌య్‌కిర‌ణ్ చేయాల్సిన సినిమా నిర్మాత ఆర్థిక స‌మ‌స్య‌ల వ‌ల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్క‌లేదు. మ‌న‌సంతా నువ్వే, నీ స్నేహం వంటి హిట్ సినిమాల త‌రువాత ఉద‌య్‌కిర‌ణ్ ఎం.ఎస్‌.రాజు ఓ సినిమా నిర్మాచాల‌నుకున్నారు ఆ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ అయింది. విభిన్న చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటీ కూడా ఉద‌య్ కిర‌ణ్‌తో ఓ సినిమా ప్లాన్ చేశాడు. కానీ ఆ ప్రాజెక్ట్ కూడా ర‌ద్ద‌యింది. ద‌ర్శ‌కుడు తేజ ఉద‌య్‌కిర‌ణ్ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు ఒక సినిమా చేయాల‌ని అనుకున్నార‌ట‌. ఆయ‌నే స్వ‌యంగా చిత్రాన్ని నిర్మించాల‌ని అనుకున్నార‌ట‌. అది కూడా కుద‌ర‌లేదు.
ఇలా దాదాపు 10 సినిమాల‌కు పైగా ఉద‌య్ కిర‌ణ్ సినిమాలు ప‌లు కార‌ణాల వ‌ల్ల ర‌ద్దయ్యాయి. అవి ర‌ద్దు కాకుండా ఉంటే ఉద‌య్ కిర‌ణ్ జీవితం మ‌రొక విధంగా ఉండేద‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also Read: ‘ఆచార్య’ వివాదం.. ఆర్ఎంపీ డాక్ట‌ర్లు పోలీసుల‌కు ఫిర్యాదు..!

Visitors Are Also Reading