చిరంజీవి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదగడానికి ముందు ఆయన పడ్డ కష్టం మాటల్లో చెప్పలేం.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అనేక ఆపసోపాలు పడ్డారు.. ఆయనకు జరిగిన ఒక అవమానమే ఆయుధంగా మార్చుకొని శపథం చేసి మరీ ఇండస్ట్రీని ఏలే స్థాయికి వచ్చారని నాగ బాబు ఈ సందర్భంగా తెలియజేసారు. నాగబాబు మాట్లాడుతూ అప్పట్లో మా అన్నయ్యకి 21 ఏళ్లు.. మద్రాస్ సినిమా ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్న సమయం. అన్నయ్య,సుధాకర్, హరి ప్రసాద్ ఒక రూమ్ లోనే ఉండేవారు. మా నాన్న 200 రూపాయలు పంపిస్తే వాటితోనే మా అన్నయ్య సర్దుకొని ఉండేవారని నాగబాబు అన్నారు. అప్పట్లో అన్నయ్య రూం పక్కనే పూర్ణ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండేది. దాని యజమాని పూర్ణ కామరాజు. అందులో సుబ్రహ్మణ్యం అనే మేనేజర్ పని చేసేవారు. వాళ్ల అబ్బాయి పేరు సూర్య. చిరంజీవిని మరియు ఆయన మిత్రులను సూర్య వాళ్ళ అమ్మ చాలా బాగా చూసుకునే వారు. వారి ఇంటికి వీరిని కాఫీ టిఫిన్లకు కూడా పిలిచారట.
Advertisement
ALSO READ:ఛత్రపతి చైల్డ్ ఆర్టిస్ట్ సూరీడు మీకు గుర్తున్నాడా..ఇప్పుడు ఎలా ఉన్నాడంటే..!!
అలాగే ఆయన డిస్ట్రిబ్యూషన్ లో రిలీజ్ అయ్యే సినిమాలకు ప్రివ్యూ ల కోసం చిరంజీవిని ఆయన మిత్రులను కూడా పిలిచేవారట. ఓసారి కొత్త సినిమా రిలీజ్ ప్రివ్యూ కోసం చిరంజీవి మరియు ఆయన మిత్రులను పిలిచి సినిమా ప్రివ్యూ చూసి ఎలా ఉందో చెప్పాలని ఆమె అన్నారట. ఈ తరుణంలో చిరు వెళ్లి థియేటర్లో మొదటి వరుసలో కూర్చున్నారట. ఇంతలోనే ఆ సినిమాలో నటించిన హీరో వచ్చి డ్రైవర్ మరియు ఇతర పని వాళ్ళ కోసం చిరంజీవి మరియు అతని మిత్రులను ఆ సీట్లలో నుంచి లేపారట.. ఈ తరుణంలో వారు బయటకు వెళ్లలేని పరిస్థితి. అలాగే వెనక్కి వెళ్లి సినిమా చూడలేరు. దీంతో వారు సినిమా అయిపోయే వరకు నిల్చొని చూశారు. సినిమా అయిపోగానే రూమ్ కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత హరి ప్రసాద్, సుధాకర్, సుబ్రమణ్యం గారి ఇంటికి వెళ్లి ఆయన భార్య ఇచ్చిన కాఫీ టిఫిన్లు తీసుకున్నారు. కానీ చిరంజీవి వారితో రాలేదు. దీంతో ఆమె వాళ్ళ అబ్బాయి సూర్యా ని పంపించి చిరంజీవి ని తీసుకు రమ్మని చెప్పింది.
Advertisement
ఆయన చిరు రూం కి వెళ్లగానే చిరు ఒంటిపై చొక్కా లేకుండా తలకు నూనె రాసుకుంటూ ఉన్నారట. ఇంతలోనే సూర్య వచ్చి అమ్మ పిలుస్తుంది అని చెప్పారట. దీంతో చిరంజీవి మొహమాటంగానే ఆ ఇంటికి వెళ్లి ఆమె ఇచ్చిన కాఫీ తాగి సైలెంట్ గా ఉన్నారట. దీంతో ఆమె ఎందుకు ఇలా సైలెంట్ గా ఉన్నావ్ అని అడిగితే, మీరు పంపిస్తే మేము మీ అతిథులుగా మేము ప్రీవ్యూకు వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళాక మాకు అవమానం జరిగింది. అలా అని మేము థియేటర్ నుంచి బయటకు రాలేదు ఎందుకంటే మీరు పంపారు కాబట్టి ఆ మాటకు కట్టుబడి ఉన్నామని, సినిమా అయిపోయే వరకు నిలబడే చూశామని వారంతా డబ్బు ఉందని విర్రవీగుతున్నారు ఆంటీ అంటూ చిరంజీవి అన్నారు. దీంతో ఆమె ఆ హీరో ఎప్పుడూ అలాగే చేస్తారు బాబు అంటూ అంది. ఈ తరుణంలో చిరంజీవి..ఆంటీ ఇండస్ట్రీకి నేను నెంబర్ వన్ హీరోగా రాకపోతే చూడండి అంటూ ఆ సమయంలో చిరంజీవి శపథం చేశారట. అలా ఇండస్ట్రీకి వచ్చి అవమానాన్ని ప్రేరణగా తీసుకొని మెగా స్టార్ గా ఎదిగారు అన్నయ్యా అంటూ అలనాటి విషయాన్ని బయటపెట్టరు నాగబాబు.
ALSO READ: