Home » ఛత్రపతి చైల్డ్ ఆర్టిస్ట్ సూరీడు మీకు గుర్తున్నాడా..ఇప్పుడు ఎలా ఉన్నాడంటే..!!

ఛత్రపతి చైల్డ్ ఆర్టిస్ట్ సూరీడు మీకు గుర్తున్నాడా..ఇప్పుడు ఎలా ఉన్నాడంటే..!!

by Sravanthi
Ad

ప్రభాస్ నటించిన సినిమాల్లో చత్రపతి మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.. ఈ సినిమా ద్వారా ప్రభాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక పిల్లాడు చాలా ఫేమస్ అయ్యాడు. సూరీడు క్యారెక్టర్ లో ఆ పిల్లాడి నటన సినిమాకు చాలా ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఎంతో పేరు సంపాదించుకున్నాడు.. “సూరీడు బస్సుకు యాళ్లయితాందిరా”.. అనే మాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులాడుతూనే ఉంటాయి. ఈ సినిమాలో సూరీడు పాత్రలో చేసిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ చాలా పెద్ద అయిపోయాడు.. ఇప్పుడు మీరు చూస్తే అవాక్కవుతారు..

Advertisement

also read:అక్కినేని ఫ్యామిలీ లో చైతూ లానే మరో వారసుడు….? కానీ ఆ కారణం వల్లే సినిమాల్లోకి రావడం లేదట…!

Advertisement

మరీ ఆ వ్యక్తి ఎవరు అనేది చూద్దాం.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చత్రపతి మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో ఆ సూరీడి పాత్రకు కూడా చాలా పేరు వచ్చింది.. ఈ మూవీ తర్వాత ఆ సూరీడు మళ్లీ తెరపై కనిపించలేదు.. కానీ ఈ మధ్య కాలంలో ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. సూరీడి పూర్తి పేరు బస్వంత్ వంశీ. ఇతడు పై చదువుల కోసం విదేశాలకు వెళ్లి ఈ మధ్యనే మళ్లీ స్వదేశానికి వచ్చారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో హీరో గా ఎంట్రీ ఇచ్చేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ తరుణంలో అతను నటించిన చిన్నప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ సంబంధించిన ఫోటోలతో, ప్రస్తుతం ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఇవి చూసినవారంతా అప్పటి సూరీడు ఎంత పెద్ద అయిపోయాడు అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇండస్ట్రీలో అతనికి అవకాశం దొరికితే మాత్రం తన సత్తా ఏంటో చూపించడానికి హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. మనం కూడా ఆ సూరీడికి ఆల్ ద బెస్ట్ చెబుదాం..

also read:ఆ యూనివర్సిటీలో దారుణం: 60 మంది అమ్మాయిల బాత్రూం వీడియోలు లీక్.. ఎవరు చేశారో తెలిస్తే షాకవుతారు..!!

Visitors Are Also Reading