Home » ఖుషి మూవీ గురించి ఆ హీరో ఆసక్తికర పోస్ట్.. అది చూస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

ఖుషి మూవీ గురించి ఆ హీరో ఆసక్తికర పోస్ట్.. అది చూస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

టాలీవుడ్  యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం వరుస సినిమాల్లో దూసుకెళ్తున్నారు రౌడీ హీరో. ఇటీవలే లైగర్ మూవీ కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. రీసెంట్ గా ఈ హీరో నటించినక్రేజీ మూవీ ఖుషి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. 

Advertisement

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో సినిమా కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ లైగర్ ప్లాప్ తో కాస్త నిరాశ చెందాడు. దీంతో ఖుషీ మూవీ ఎంతో నమ్మకంగా ఉన్నాడు రౌడీ హీరో. ఆయన అభిమానులు కూడా ఖుషి మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండకు జంటగా స్టార్ హీరోయిన్ సమంతహీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఈ మూవీతో విజయ్ దేవరకొండ, సమంత జంటగా మంచి క్రేజ్ ఏర్పడింది. వీరి కెమిస్ట్రీని తెరమీద చూడాలని ప్రేక్షకులు అంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 01న విడుదల కాబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 

Advertisement

ఈ సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచాలని చూస్తున్నారు.ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడూ వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ ని చూశాడు. అందులో 8 రోజులు, 14 రోజులు 30 రోజులు అంూట విజయ్ దేవరకొండ ఓ ట్వీట్ చేయగా.. ఇందులో 8 రోజులు ట్రైలర్ విడుదల తేదీ అని అంతా అనుకుంటున్నారు. 14 రోజులు అంటే ఏంటో తెలియాల్సి ఉంది. 30 రోజులు అంటే సినిమా విడుదల తేదీ అని తెలుస్తోంది. మొత్తానికి విజయ్ అలా హింట్ ఇచ్చేశాడు. విజయ్ దేవరకొండ ఇచ్చిన హింట్ ప్రకారం.. ఈ మూవీ ట్రైలర్ ఆగస్టు 09న విడుదలవుతుందో లేదో వేచి చూడాలి. 

Visitors Are Also Reading