Home » చీక‌ట్లో ఆ హీరోయిన్ తో చై…వైర‌ల్ పిక్…!

చీక‌ట్లో ఆ హీరోయిన్ తో చై…వైర‌ల్ పిక్…!

by AJAY
Ad

యువ‌సామ్రాట్ నాగ‌చైతన్య హీరోగా న‌టిచిస్తున్న తాజా చిత్రం థాంక్యూ. రీసెంట్ గా బంగార్రాజు , ల‌వ్ స్టోరీ సినిమాల విజ‌యంతో నాగ‌చైత‌న్య ఫుట్ జోష్ మీద ఉన్నాడు. ఇక ఇప్పుడు థాంక్యూ సినిమాపైనే పూర్తి దృష్టి పెట్టాడు. ఈ సినిమాకు విక్ర‌మ్ కుమార్ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య‌కు జోడీగా రాశీక‌న్నా, అవికా గోర్ లు హీరోయిన్లు గా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

thank you movie photo

Advertisement

Advertisement

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ నుండి రాశీక‌న్నా కొన్ని ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల‌లో నాగ‌చైత‌న్య రాశీక‌న్నా బ్లాక్ డ్రెస్సుల్లో క‌నిపిస్తున్నారు. చీక‌టి గ‌దిలో చైతూ న‌వ్వుతుండ‌గా అత‌డి ఎదురుగా రాశీకన్నా క‌నిపిస్తోంది. ఎంతో క్యూట్ గా ఉన్న ఈ పిక్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇదిలా ఉండ‌గా నాగ చైత‌న్య ప్ర‌స్తుతం అమీర్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న ఓ బాలీవుడ్ సినిమాలోనూ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా కూడా విజ‌యం సాధిస్తే చైతూ కెరీర్ కు ఇక తిరుగుండ‌ద‌ని అక్కినేని ఫ్యాన్స్ కుషీ అవుతున్నారు.

Visitors Are Also Reading